వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అరెస్టయిన కొద్ది నిమిషాల్లోనే రామ్చరణ్ తన
ట్విట్టర్లో ‘ఫైనల్లీ ద
గవర్నమెంట్ హేజ్ ప్రూవ్డ్ ఇట్స్
క్యాపబిలిటీ’(జగన్ను అరెస్ట్ చేయడం
ద్వారా ప్రభుత్వం తన సత్తా చాటుకుంది)
అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆ ట్వీట్ కు
రిప్లైగా కొన్ని నెగిటివ్ కామెంట్స్ కొందరు రిప్లైగా ఇచ్చారు. ఇప్పుడు అవి ఓ లీడింగ్
న్యూస్ పేపరు వెలుగులోకి తెచ్చి
హైలెట్ చేయటంతో ట్వీట్స్ ఫాలో కాని వారికి
కూడా ఇవి తెలిసి చర్చనీయాంసంగా
మారాయి.
ట్విట్టర్లో రామ్చరణ్కి కౌంటర్ గా
వచ్చిన ట్వీట్స్...
* జగన్
అరెస్ట్పై స్పందించావు సరే..
నీ సోదరి ఇంటిపై ఐటీ
శాఖ దాడులు చేసి రూ.80 కోట్లు
స్వాధీనం చేసుకుంది. మరి ఆ దాడులపై
ట్విట్టర్లో ఎందుకు ప్రస్తావించవు?
* రామ్
చరణ్ టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న
పిల్లవాడు. నిలదొక్కుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాడు. అతని తండ్రి రాజకీయాలను
అతికష్టంగా నెట్టుకొస్తూ.. ఏ మాత్రం ఊహించని
దారుణమైన అవమానాలు ఎదుర్కొంటున్నాడు. ఈ స్థితిలో ట్విట్టర్లో వ్యాఖ్యలు చేసేంతగా
రామ్చరణ్కు రాజకీయాలతో
ఏమిటి సంబంధం?
* గబ్బర్
సింగ్ చిత్ర విజయంపై స్పందించేందుకు
సమయం లేదుగానీ అనవసర విషయాలపై స్పందించేందుకు
నీకు కావలసినంత సమయముంది.
రామ్
చరణ్ తండ్రి చిరంజీవి పాలిటిక్స్ లో జగన్ కి
వ్యతిరేకంగా ఉన్న దాన్ని దృష్టిలో
పెట్టుకుని చరణ్ కామెంట్ చేసాడని
అంటున్నారు. అయితే రామ్ చరణ్
పొలిటికల్ కామెంట్ చేయటం కొందరు అబిమానులను
ఆనందపరిచినా మరికొందరు నెగిటివ్ గా తీసుకుంటున్నారు. మరి
కొందరు అయితే ప్రస్తుతం చేస్తున్న
చిత్రాల అప్ డేట్స్ ఇలా
ట్వీట్స్ తో ఇవ్వచ్చుగా ఎప్పటికప్పుడు
అంటున్నారు.
ప్రస్తుతం
రామ్ చరణ్ తేజ ఎవడు
షూటింగ్ లో రెగ్యులర్ గా
పాల్గొంటున్నారు. వంశీ పైడిపల్లి కాంబినేషన్
లో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత
దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ
ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గత కొన్ని రోజుల
క్రితమే ఈ సినిమా షూటింగ్
మెగా స్టార్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా చిత్ర
ప్రారంభోత్సవం జరిగి ఇప్పుడు రెగ్యులర్
షూటింగ్ జరుగుతోంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర
డిఫెరెంట్ గా ఉండనుంది. ఆ
పాత్ర గురించి మాట్లాడుతూ...గుడిని మింగేవాడుంటే, ఆ గుడిలోని లింగాన్ని
కూడా స్వాహా చేసేవాడు ఒకడుంటాడు. ఒక బంతికి ఆరు
పరుగులు కొడితే, ఏడో పరుగుకీ దౌడు
తీసేవాడొకడు వస్తాడు. అందుకే పెద్దవాళ్లన్నారు తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడూ
ఉంటాడని. అలాంటివాడే రామ్చరణ్...ఆ
పాత్రను ఎవడు చిత్రంలో చూడాలి
అంటున్నారు.
ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా
ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ
చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
ఇందులో సమంతతో పాటు సెకండ్ హీరోయిన్గా బ్రిటిష్ మోడల్
అమీ జాక్సన్ను కూడా ఎంపిక
చేశారు. ‘మద్రాసు పట్టణం’ అనే సినిమా ద్వారా
భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన
ఈ బ్రిటిష్ మోడల్, ఆతర్వాత ‘ఏక్ దివానాథా’ అనే హిందీ చిత్రంతో
పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో
కూడా అవకాశం దక్కించుంది. రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా
ఆమెకు తొలి తెలుగు సినిమా
కాబోతోంది. ఇక ఈ చిత్రంతో
పాటు వినాయిక్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలోనూ రామ్ చరణ్ చేస్తున్నారు.
హిందీ జంజీల్ లో మొన్నీ మధ్యనే
షూటింగ్ లో పాల్గొని వచ్చాడు.
0 comments:
Post a Comment