ప్రపంచంలోనే
అత్యంత చవక ధరకే కారును
సృష్టించడమే కాకుండా, దానిని విజయవంతంగా మార్కెట్లోకి తీసుకువచ్చిన టాటా మోటార్స్ గాలితో
నడిచే కారును అభివృద్ధి చేస్తున్నట్లు గతంలో ఓ కథనంలో
ప్రచురించిన సంగతి తెలిసిందే. టాటా
మోటార్స్ అభివృద్ధి చేసిన ఈ గాలితో
నడిచే కారును ప్రయోగాత్మకంగా టెస్టింగ్ చేశామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
మోటార్
డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ (లక్సెంబర్గ్)
నుండి టాటా మోటార్స్ లైసెన్స్
పొంది అభివృద్ధి చేస్తున్న ఎయిర్-పవర్డ్ కారు
అభివృద్ధిలో ఇది మొదటి దశ.
2007లో ఈ రెండు కంపెనీలు
ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా,
ఎమ్డిఐ టెక్నాలజీని ఉపయోగించి
కంప్రెస్డ్-ఎయిర్ ద్వారా నడిచే
కార్లను టాటా మోటార్స్ ఉత్పత్తి
చేసి, ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తుంది.
ఈ ఎయిర్-పవర్డ్ కార్
రెండవ దశలో భాగంగా, రెండు
కంపెనీలు కలిసి ఈ అభివృద్ధిని
పూర్తి చేసి, ప్రొడక్షన్కు
సిద్ధంగా ఉండే కారును తయారు
చేయనున్నాయి. ఈ టెక్నాలజీని ఇటు
ప్యాసింజర్, అటు కమర్షియల్ వాహనాల్లో
ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
టాటా
మోటార్స్ ఇప్పటికే నీటితో నడిచే ఓ కారును
కూడా అభివృద్ధి చేయడంలో బిజీగా ఉంది. టాటా మోటార్స్
అభివృద్ధి చేసిన ఈ ఎయిర్-పవర్డ్ కారులో ఓ ఎయిర్ ట్యాంక్
అమర్చబడి ఉంటుంది. ఒక పూర్తి ఎయిర్ట్యాంక్తో సుమారు 300 కి.మీ. ప్రయాణించవచ్చు. తక్కువు
బరువుండేలా ఈ కారును డిజైన్
చేయటం వలన ఎక్కువ దూరం
ప్రయాణించేదుకు వీలవుతుంది.
0 comments:
Post a Comment