హైదరాబాద్:
టాస్క్ఫోర్స్ కమిషనర్ తూర్పు మండలం బృందం, ఆబిడ్స్
పోలీసులు కలిసి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను
అరెస్టు చేశారు. నకిలీ వీసా కన్సల్టెన్సీని
నడుపుతున్నందుకు వారు అతన్ని అరెస్టు
చేశారు. ఉద్యోగం వదిలేసి ముహమ్మద్ రజా అనే 31 ఏళ్ల
టెక్కీ హైదరాబాదులోని ఆబిడ్స్ చిరాగ్ అలీలేన్లో ఎంఎంఆర్ వరల్డ్
ట్రావెల్స్ పేర వీసా కన్సల్టెన్సీ
సంస్థను నడుపుతున్నాడు.
వీసా
కన్సల్టెన్సీ ద్వారా ద్వారా అతను 2008 నుంచి సులభంగా డబ్బులు
సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. బిజినెస్ వీసాలు ఇప్పిస్తానని కస్టమర్ల నుంచి రజా ఒరిజినల్
పాస్పోర్టులు, ఇతర సమాచారం తీసుకునేవాడు.
ఆ తర్వాత నకిలీ ఆదాయం పన్ను
రిటర్న్స్, వాణిజ్య అనుభవం సర్టిఫికెట్లు వివిధ కంపెనీలకు సంబంధించివి
తయారు చేసేవాడు. ఇందుకు కంపెనీల ఫోన్ నెంబర్లకు బదులు
తన కార్యాలయం ఫోన్ నెంబర్ ఇచ్చేవాడు.
వివిధ
సాఫ్ట్వేర్లు వాడి జాతీయ బ్యాంకుల
స్టేట్మెంట్లు, ఐటి రిటర్న్స్ పత్రాలు
తయారు చేసేవాడు. యూరోప్, కెనడా, అమెరికాల్లో ఉండడానికి తాత్కాలిక అనుమతి కావాలని అనుకునేవారు రజా సాయం కోరేవారు.
వారి నుంచి పెద్ద మొత్తంలో
డబ్బులు తీసుకుని వాటిని వారికి అందజేసేవాడు. నకిలీ పత్రాలను పొందిన
కస్టమర్లు వాటిని వీసాలకోసం కాన్సులేట్ కార్యాలయాల్లో సమర్పించేవారు.
బిజినెస్
అనుభవం గురించి కాన్సులేట్ కార్యాలయం నుంచి ఫోన్ వస్తే
రజా సమాధానం ఇచ్చేవాడు. తాను ఆ కంపెనీకి
డైరెక్టర్ను అని చెప్పుకునేవాడు.
తమ కంపెనీలో వీసాకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి పనిచేస్తున్నాడని చెప్పేవాడు.
0 comments:
Post a Comment