గుంటూరు:
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసిరారు. చంద్రబాబు
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుంటురూ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు.
ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసిరారు. అది
బాబుకు కొద్ది దూరంలో పడింది. పెదనందిపాడు మండలం వరగానిలో రాత్రి
తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ
సంఘటన జరిగింది.
బాబు
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం
చేశారు. ఇది వరగానానా. పులివెందులలా
ఉందన్నారు. ఇక్కడ రౌడీరాజ్యం సాగుతున్నట్లుగా
కనిపిస్తోందన్నారు. తోక కోస్తాను.. జాగ్రత్త
అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత రోడ్
షో కొనసాగించారు. కాగా తన ఎన్నికల
ప్రచారంలో చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో విరుచుకు
పడిన విషయం తెలిసిందే.
వైయస్
జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరితే జైలుకే వెళ్తారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
అన్నారు. వైయస్ జగన్పై
ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తన ప్రభుత్వ హయాంలో
పనిచేసిన అధికారులు పైస్థాయిలకు చేరుకున్నారని, వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రభుత్వంలో పనిచేసిన ఐఎఎస్ అధికారులు చంచల్గుడా జైలుకు వెళ్లారని,
విశ్వసనీయత అంటే అదని ఆయన
అన్నారు.
వైయస్
జగన్ వెంట నడిస్తే హైదరాబాదులోని
చంచల్గుడా జైలుకు వెళ్లడం
ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరూ
కాపాడే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. రాష్టంలో
సమస్యలు చాలా ఉన్నాయని, అన్ని
రంగాలవారు సమస్యలు ఎదుర్కుంటున్నారని, రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని
ఆయన అన్నారు. రైతులను చూస్తే గుండె తరుక్కుపోతుందని, తన
చివరి రక్తం బొట్టు వరకు
రైతుల కోసం పనిచేస్తానని ఆయన
అన్నారు.
తెలుగుదేశం
పార్టీ విజయం చారిత్రక అవసరమని,
తనకు కుటుంబ సభ్యులకన్నా పార్టీ శ్రేణులే ముఖ్యమని ఆయన అన్నారు. రాష్టం
సమస్యల సుడిగుండంలో ఉందని, కాంగ్రెసుకు ఓటేస్తే ముందు ముందు మరిన్ని
ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన అన్నారు. మద్యం
మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్
మాఫియాలను కాంగ్రెసు పెంచి పోషించిందని ఆయన
అన్నారు. రౌడీలను, గుండాలను పెంచి పోషించడం తప్ప
కాంగ్రెసు సాధించిన విజయాలు ఏమీ లేవని ఆయన
అన్నారు.
పరిటాల
రవి హత్య కేసులో నిందితులను
ఒక్కరొక్కరినే చంపుకుంటూ పోయారని ఆయన ఆరోపించారు. సాక్ష్యాలు
బయటకు వస్తాయనే అలా చేసుకుంటూ వెళ్లారని
ఆయన అన్నారు. సూరి హత్య కేసులో
ప్రధాన నిందితుడు భాను కిరణ్ 800 కోట్ల
రూపాయల సంపాదించాడని ఆయన అన్నారు. భాను
కిరణ్కు పులివెందుల కృష్ణకు
సంబంధాలున్నాయని, పులివెందుల కృష్ణతో జగన్కు సంబంధాలున్నాయని
ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రభుత్వ హయాంలో తమ పార్టీ కార్యకర్తలను
హత్య చేశారని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment