హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి
దెబ్బ మీద దెబ్బ పడుతోంది.
పార్టీని వీడినవారు తిరిగి రావాలని ఆయన పిలుపు ఇస్తున్న
నేపథ్యంలో ఒక్కరొక్కరే పార్టీని వీడే దిశలో సాగుతున్నట్లు
కనిపిస్తోంది. తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ నాయకత్వంపై బహిరంగ విమర్శలకు దిగారు.
తాను
కాపుల తరఫున పోరాడినందుకే తనకు
గానీ తనవారికి గానీ పార్టీ సభ్యత్వం
ఇవ్వనట్లున్నారని ఆయన అన్నారు. కాపులకు
తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
శాసనసభ టికెట్లు 1985 - 86 ప్రాంతంలో కాపులకు 25 దాకా ఇచ్చేవారని, పార్లమెంటు
సీట్లు ఆరేడు ఇచ్చేవారని, ఇప్పుడు
పార్లమెంటు సభ్యుల్లో ఒక్కరు కూడా లేరని ఆయన
అన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు
చెబుతున్నారు.
గతంలో
ఓసారి కూడా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
పార్టీకి దూరమయ్యారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ చంద్రబాబుకు దగ్గరయ్యే
ప్రయత్నాలు చేశారు. అయినా పరిస్థితిలో మార్పు
రాకపోవడంతో ఆయన బహిరంగ విమర్శలు
చేసినట్లు కనిపిస్తోంది. కాపులకు తమ పార్టీలో తగిన
ప్రాధాన్యం ఉంటుందని, పార్టీలోకి రావాలని ఆ మధ్య కోస్తాంధ్ర
పర్యటనలో చెప్పారు. కానీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
విమర్శలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నాయి.
చంద్రబాబు
వైఖరి నచ్చక తెలుగుదేశం పార్టీ
నుంచి ఒక్కరొక్కరే పార్టీని వీడుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల గద్దె బాబూరావు
తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. మాజీ పార్లమెంటు సభ్యుడు
ఎంవి మైసురా రెడ్డి కూడా పార్టీని వీడుతారనే
ప్రచారం జరుగుతోంది. విజయవాడ పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ ఉదంతం పార్టీలో
చిచ్చు పెట్టింది. ఉప ఎన్నికల నేపథ్యంలో
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శలు పార్టీకి నష్టం చేస్తాయని అంటున్నారు.
0 comments:
Post a Comment