యునెటైడ్
మూవీస్ పతాకంపై వెంకటేశ్, శ్రీకాంత్ కాంబినేషన్లో సింహా నిర్మాత
పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రం ‘షాడో’.
మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ
చిత్రం లో వెంకటేష్ పాత్ర
విభిన్నంగా ఉంటుందని దర్శకుడు చెప్తున్నారు. నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ...ఇందులో వెంకటేష్ది మాఫియా లీడర్
పాత్రా? లేక మాఫియా సామ్రాజ్యాన్ని
నిర్వీర్యం చేసే అధికారి పాత్రా?
అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. గతంలో వెంకటేష్ చాలా
కాలం క్రితం మాఫియా నేపథ్యంలో ‘ధ్రువనక్షత్రం’ సినిమా
చేశారు. అది హండ్రెడ్ డేస్
ఫిల్మ్. ఆ తర్వాత దాదాపుగా
ఆ నేపథ్యంలో ఆయన సినిమా చేయలేదు.
మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మాఫియా బ్యాక్డ్రాప్లో ‘షాడో’ చేస్తున్నారు.
దర్శకుడు
మెహర్ రమేష్ మాట్లాడుతూ...వెంకటేష్
కెరీర్లో స్టైలిష్ ఫిలింగా
ఈ సినిమా నిలుస్తుంది. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన మాఫియా నేపథ్య చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది.
భావోద్వేగాల మేలుకలయిక ఈ చిత్రం. వెంకటేష్ని అమితంగా ఇష్టపడే
కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా
నచ్చుతుందని అన్నారు.
వెంకటేశ్
మాట్లాడుతూ -‘‘ఇది కమర్షియల్ ఎంటర్టైనర్. నా కెరీర్లో
గుర్తించుకోదగ్గ మరో పెద్ద కమర్షియల్
సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. శ్రీకాంత్ కూడా
చాలా మంచి పాత్ర పోషిస్తున్నాడు.
యాక్షన్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతోన్న
ఈ సినిమా మా అందరికీ మంచి
పేరు తెస్తుందని ఆశిస్తున్నాము. ఈ సినిమా అందరికీ
మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.
‘సంక్రాంతి’ చిత్రం
తర్వాత మరోసారి వెంకటేశ్, శ్రీకాంత్ కలిసి నటిస్తున్న చిత్రానికి
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
తాప్సీ, మధురిమ హీరోయిన్స్ గా చేస్తున్న చిత్రం
ఈ వారంలోనే మలేసియాలో మలి షెడ్యూల్ మొదలవుతుంది.
తొలి షెడ్యూల్ పూర్తయింది. 52 రోజుల పాటు నిరవధికంగా
జరిపే ఈ షెడ్యూల్లో
ప్రధాన తారాగణమంతా పాల్గొంటారు.
నాగబాబు,
ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్రుషి, ప్రభు, సూర్య,
ఉత్తేజ్, రావురమేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న
ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్,
మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్, సంగీతం:
తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్:
ప్రకాష్ ఏఎస్, ప్రొడక్షన్ కంట్రోలర్:
పి.అజయ్కుమార్వర్మ.
0 comments:
Post a Comment