వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు చిరంజీవిపై
రివర్స్ ఎటాక్కు దిగుతున్నారు.
జగన్ మంగళవారం నుండి తిరుపతిలో పర్యటిస్తున్నారు.
ఆయన అక్కడ చిరంజీవిని లక్ష్యంగా
చేసుకొని ఘాటైన విమర్శలు చేస్తున్నారు.
ఒక విధంగా ఆయన అక్కడ కాంగ్రెసు,
చిరంజీవిపై రివర్స్ అటాక్కు దిగుతున్నారనే
చెప్పవచ్చు.
రాష్ట్రంలో
ఉప ఎన్నికలు జగన్ పదవీ కాంక్ష
వల్ల వచ్చినవని ప్రదేశ్ కాంగ్రెసు నేతలతో పాటు చిరంజీవి కూడా
ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఒక
వ్యక్తి స్వార్థం కోసమే ఈ ఉప
ఎన్నికలు అని చిరు మండిపడ్డారు.
అయితే దానికి జగన్ తిరుపతిలో చిరుకు
కౌంటర్ ఇస్తున్నారు. పదిహేడు ఉప ఎన్నికలు ఒక
వ్యక్తి స్వార్థం కోసమైతే తిరుపతి ఉప ఎన్నిక ఎందుకు
వచ్చిందని ఆయన చిరును ప్రశ్నిస్తున్నారు.
తన వర్గం నేతలు రైతులు,
ప్రజల సమస్య కోసం రాజీనామా
చేశారని జగన్ స్పష్టం చేశారు.
కానీ చిరంజీవి మాత్రం రాజకీయ ప్రమోషన్ కోసం తన పదవిని
వదులుకున్నారని విమర్శించారు. తన వర్గం నేతలలాగే
చిరంజీవి కూడా ప్రజల సమస్యల
కోసం పదవి వదులకుంటే తాను
ఎంతో సంతోషించే వాడిని అన్నారు. రాజ్యసభకు వెళ్లేందుకు చిరు ఎమ్మెల్యే పదవికి
రాజీనామా చేసి ఉప ఎన్నికకు
కారణమయ్యారని చెప్పారు.
కానీ
తన వర్గం నేతలు మాత్రం
ప్రజల కోసమే రాజీనామా చేశారన్నారు.
పేదవాడికి కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వం ఒక కొత్త ఇల్లు
కట్టించలేదనో, తన నియోజకవర్గం ప్రజలకు
తాగునీరు లేని పరిస్థితుల్లో ఉందనో,
ఆరోగ్యశ్రీ పథకం బాగాలేదనో, ఫీజు
రీయింబర్సుమెంట్స్ విద్యార్థులకు సరిగా అందడం లేదనో
చిరంజీవి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తాను గర్వపడేవాడినని, కానీ
ఆయన రాజ్యసభ కోసం నిస్సిగ్గుగా పదవి
వదులుకున్నారని అన్నారు.
అసలు
చిరంజీవి తిరుపతి ప్రజలకు చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు. జగన్
వర్గం నేతల రాజీనామాలు ఆయన
ముఖ్యమంత్రి పదవి కోసమే అన్న
కాంగ్రెసుకు జగన్ తిరుపతిలో చిరంజీవి
రాజీనామాపై ప్రశ్నించి అధికార పార్టీనే ఇరకాటంలోకి నెట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు భావిస్తున్నారు.
0 comments:
Post a Comment