Showing posts with label Tirupati. Show all posts
Showing posts with label Tirupati. Show all posts

Saturday, June 30, 2012

Telangana issue resolved in August : Lagadapati

తిరుపతి/ హైదరాబాద్: తెలంగాణపై ఆగస్టులో స్పష్టమైన వైఖరి వెలువడుతుందని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన శనివారం ఉదయం కలియుగ వైకుంఠ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో కాంగ్రెసు 2014లో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి త్వరలో కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ 60 శాతం ఓట్లతో రాష్ట్రపతి అవుతారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే పరిష్కారమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై ఇచ్చిన మాటకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా కట్టుబడి ఉంటారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన శనివారం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై తమకు ఆసక్తి లేదని ఆయన చెప్పారు. నాయకత్వ మార్పు వల్ల తెలంగాణకు ఏ విధమైన ఉపయోగం లేదని ఆయన అన్నారు. తమకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే కావాలని ఆయన అన్నారు.

Wednesday, May 23, 2012

CM Kiran retaliates Ys jagan


తిరుపతి: ఎన్నికలు వాయిదా పడతాయని వ్యక్తి పిచ్చిపిచ్చి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై మండిపడ్డారు. అరెస్ట్ భయంతోనే వ్యక్తి అసత్య ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. జూన్ 12 తేదీన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం తిరుపతి సభలో మాట్లాడారు.

సిబిఐ విచారణలో ఉన్న వైయస్ జగన్ తమ సంస్థలోకి వేలకోట్ల పెట్టుబడులు ఎలా వచ్చాయో చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో టీడీపీ నేత కొందాట శంకర్రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అలాగే 14 మంది మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ చేరారు. వైయస్ జగన్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

సిబిఐ దర్యాప్తుతో కాంగ్రెసుకు విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కాంగ్రెసు గెలుచుకుంటుందని ఆయన అన్నారు. అరెస్టు అవుతాననే భయంతోనే వైయస్ జగన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సిబిఐ దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ జోక్యం చేసుకోవడం లేదని, సిబిఐ దర్యాప్తు విషయంలో వేరేవారిని జగన్ నిందించడం సరి కాదని ఆయన అన్నారు.

వైయస్ జగన్ అసత్యప్రచారం చేస్తున్నారని, వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు. ఆర్థిక నేరాలతో అరెస్టు అవుతానని జగన్ భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తన సంస్థల్లో వచ్చిన పెట్టుబడులపై వైయస్ జగన్ వివరణ ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. తనను అరెస్టు చేయించడానికి కుట్ర చేస్తున్నారని వైయస్ జగన్ మంగళవారం గుంటూరు జిల్లాలో చేసిన వ్యాఖ్యలపై కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు.

Saturday, May 5, 2012

I warned Raja Reddy : Chandra babu Naidu


Rebels threat to Chandrababu at tirupati


తిరుపతి: తిరుపతి శానససభా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి తిరుగుబాటు అభ్యర్థుల బెడద తాకేట్లుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ నామినేషన్లు వేసేందుకు ఇద్దరు, ముగ్గురు తెలుగుదేశం నాయకులు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పరిణామం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా పరిణమించింది.

శంకర్ రెడ్డి, ఓవి రమణ వంటి నాయకులు చదలవాడ కృష్ణమూర్తి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాము నామినేషన్లు వేస్తామని వారు అటున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థితిలో తిరుపతి శాసనసభా నియోజకవర్గంలో పోటీ తెలుగుదేశం పార్టీకి కత్తి మీద సాములా మారింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం చేకూర్చేందుకే వారు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెసు నుంచి వెంకటరమణ బరిలోకి దిగుతున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇద్దరు కూడా బలిజ వర్గానికి చెందినవారే. ఇరు పార్టీల మధ్య సామాజిక వర్గం ఓట్లు చీలిపోతాయని భావిస్తున్నారు. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి గట్టెక్కడం సులభమవుతుందని భావిస్తున్నారు.

అసమ్మతివాదులను బుజ్జగించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలోని 18 స్థానాలకు, ఒక లోకసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

Friday, May 4, 2012

Chandrababu attacks YS Jagan


తిరుపతి శానససభ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు. డిక్లరేషన్పై సంతకం చేయకుండా వైయస్ జగన్ తిరుమలేశుడ్ని సందర్శించుకోవడంపై ఆయన విరుచకుపడ్డారు. ఆయన తిరుపతిలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హిందువులకు తిరుపతి క్రైస్తవులకు వాటికన్ సిటిలాంటిదని, తిరుమల పవిత్రతను జగన్ దెబ్బ తీశారని ఆయన అన్నారు.

మత సామరస్యాన్ని గౌరవించాలని, అయితే ఒక మతాన్ని కించపరిచే విధంగా వ్యవహరించడం ధర్మం కాదని ఆయన జగన్ను చర్యను తప్పు పట్టారు. తిరుమలేశుడిని ఎవరైనా దర్శించుకోవచ్చునని, అయితే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని,, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ కూడా డిక్లరేషన్పై సంతకం చేశారని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా సంతకం చేసినట్లు గుర్తుందని ఆయన అన్నారు.

డిక్లరేషన్పై సంతకం చేయకుండా వైయస్ జగన్ దౌర్జన్యంగా జగన్ దర్శనానికి వెళ్లారని ఆయన విమర్శించారు. నాయకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం, చట్టాన్ని అతిక్రమించడం సరి కాదని ఆనయ అన్నారు. తిరుపతిని అభివృద్ధి చేయాల్సింది పోయి అపవిత్రం చేస్తున్నారని ఆయన అన్నారు.

తిరుపతిని అభివృద్ధి చేసింది, పవిత్రతను కాపాడింది తమ పార్టీయేనని ఆయన చెప్పుకున్నారు. కాంగ్రెసు అంటేనే రౌడీయిజానికి, మద్యం వ్యాపారానికి కేంద్రంగా చెప్పాల్సి వస్తోందని ఆయన అన్నారు. బినామీ పేర్లతో తెల్ల కార్డులతో మద్యం దుకాణాలు కొనుక్కుని కాంగ్రెసు మద్యాన్ని ఏరులుగా పారిస్తున్నారని ఆయన అన్నారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ను పెంచి పోషించింది కేూడా వైయస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు వైయస్ జగన్ అని చంద్రబాబు ఆరోపించారు.

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget