తిరుపతి/
హైదరాబాద్: తెలంగాణపై ఆగస్టులో స్పష్టమైన వైఖరి వెలువడుతుందని కాంగ్రెసు
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన శనివారం ఉదయం
కలియుగ వైకుంఠ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని
దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన
మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ప్రభుత్వం
అమలు చేస్తున్న పథకాలతో కాంగ్రెసు 2014లో అధికారంలోకి వస్తుందని
ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి త్వరలో కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆయన
జోస్యం చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ 60 శాతం ఓట్లతో రాష్ట్రపతి
అవుతారని ఆయన అన్నారు. రాష్ట్రంలో
ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం లేదని ఆయన
స్పష్టం చేశారు.
ప్రస్తుతం
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే పరిష్కారమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై ఇచ్చిన మాటకు తమ పార్టీ
అధ్యక్షురాలు సోనియా కట్టుబడి ఉంటారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన శనివారం క్యాంప్
కార్యాలయంలో కలిశారు. ఆ తర్వాత మీడియాతో
మాట్లాడారు.
రాష్ట్రంలో
నాయకత్వ మార్పుపై తమకు ఆసక్తి లేదని
ఆయన చెప్పారు. నాయకత్వ మార్పు వల్ల తెలంగాణకు ఏ
విధమైన ఉపయోగం లేదని ఆయన అన్నారు.
తమకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే కావాలని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment