బాలకృష్ణ
అతిధిపాత్రలో రూపొందిన చిత్రం ‘ఊకొడతారా..ఉలిక్కి పడతారా'. జూలై 27న విడుదల అవుతున్న
ఈ చిత్రంకోసం బాలకృష్ణ 44 రోజులు కష్టపడి పనిచేశారని మోహన్ బాబు చెప్తున్నారు.
ఆయన మాట్లాడుతూ...బాలకృష్ణ పాత్ర చూసి జెలసీ
కూడా అనిపించింది. ‘పెదరాయుడు'లాంటి పాత్ర అది.
ఆ పాత్రను మిస్సయ్యాను అనే ఫీలింగ్ ఉంది.
ముఖ్యంగా బాలకృష్ణ నటన గురించి చెప్పుకోవాలి.
ఉదయం ఏడు గంటల నుంచి
మరుసటి రోజు ఉదయం ఏడింటి
వరకూ ఈ సినిమా కోసం
కష్టపడ్డాడు. అదంతా నా బిడ్డల
కోసమే. ఆయన పాత్ర అందరూ
ఉలిక్కిపడేలా వచ్చింది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు
కొత్త అనుభూతిని పంచుతుంది. బాలకృష్ణ 44 రోజులు కష్టపడి పనిచేశాడు అన్నారు.
అలాగే
‘ఊ కొడతారా... ఉలిక్కిపడతారా' ఫైనల్ వెర్షన్ చూశాక
ఓ పక్క చాలా ఆనందమనిపించింది.
తెలుగుతో పాటు తమిళంలో కూడా
ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. దర్శకుడు అద్భుతంగా తీశాడు. 'డాడీ.. నా జీవితాశయం ఈ
సినిమా' అని మనోజ్ నాతో
చాలాసార్లు చెప్పాడు. అన్నట్టుగానే చాలా కష్టపడ్డాడు. మనోజ్‌కి ఈ సినిమాతో
కచ్చితంగా స్టార్‌డమ్ వస్తుంది. ఓ
బంపర్‌హిట్ కొట్టాకే మనోజ్
పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఈ సినిమాతో అతని
కోరిక నెరవేరుతుంది అన్నారు.
ఇక లక్ష్మీప్రసన్న నిర్మాత అవుతానంటే మొదట నేను ఇష్టపడలేదు.
పరిస్థితులు మునుపటిలా లేవు కాబట్టి, వేరే
రంగాన్ని ఎంచుకోమన్నాను. కానీ తను ఇష్టపడి
ఇక్కడకు వచ్చింది. తొలి ప్రయత్నంగా ‘ఝుమ్మంది
నాదం' తీసి, మంచి సక్సెస్
చేసింది. ఇప్పుడు ఈ సినిమాని బాగా
ఖర్చుపెట్టి తీసింది. కేవలం ‘గంధర్వమహల్' సెట్‌కే 6 కోట్ల
25 లక్షల రూపాయలు ఖర్చుపెట్టింది అని తెలిపారు. అలాగే
సినిమా పూర్తయిన తరవాత కొంతమంది రచయితలకు
చూపించాను. వారి స్పందనతో మరింత
ధైర్యం వచ్చింది అన్నారు.
ఇక తను హీరోగా రూపొందే
చిత్రం త్వరలో ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. 2008 నుంచి
ఈ సినిమా చేయాలనేది తన డ్రీమ్..వైవిధ్యమైన
సినిమాని వాణిజ్యపరమైన హంగులతో తీయాలనేది నా కల. ఈ
సినిమాతో నెరవేరింది''అని మనోజ్ చెప్పారు.
''రెండేళ్ల తపన ఈ చిత్రం.
చిత్ర బృందమంతా ఎంతో ఇష్టపడి పని
చేశాం. అనుకున్న సమయానికింటే ముందే తీసుకొస్తున్నాం. ప్రతి
సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగుతుంది. వినసొంపైన సంగీతం తోడైంది''ని లక్ష్మీప్రసన్న తెలిపారు.
బాలకృష్ణ
ముఖ్య పాత్రలో మనోజ్, దీక్షాసేథ్ హీరోహీరోయిన్లుగా శేఖర్‌రాజా దర్శకత్వంలో
మంచు లక్ష్మీప్రసన్న నిర్మించిన ‘ఊ కొడతారా... ఉలిక్కిపడతారా'
ఈ నెల 27న విడుదల
కానుంది. బాలకృష్ణ, ప్రభు, మనోజ్, దీక్షాసేథ్, లక్ష్మీ ప్రసన్న, సోనూసూద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన
ఈచిత్రానికి సంగీతం బెబో శశి.
0 comments:
Post a Comment