కరీంనగర్:
కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడంపై తెలుగుదేశం
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల
శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ స్పందించాలని
తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యురాలు
హరీష్ రావు డిమాండ్ చేశారు.
కృష్ణా డెల్టాకు నీటి కేటాయింపులపై వారు
ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వారు
వెంటనే తమ వైఖరి చెప్పాలన్నారు.
కృష్ణా
డెల్టాకు నీరు ఇవ్వడానికి తమ
పార్టీ ఏమాత్రం వ్యతిరేకం కాదన్నారు. అయితే తెలంగాణ ప్రజల
గొంతు ఎండబెట్టి సీమాంధ్రకు నీళ్లివ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కృష్ణా
డెల్టాకు నీళ్లు వదలడం సహజ న్యాయసూత్రాలకు
విరుద్ధమన్నారు. అర్ధరాత్రి దొంగచాటున నీళ్లు విడుదల చేస్తున్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
జానా రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ కోసమే మౌనంగా ఉన్నారని
ఆరోపించారు.
ఈ అంశంపై కనీసం నిరసన తెలపని
తెలంగాణ మంత్రులు ఆశ్రమాలలో చేరాలని ఎద్దేవా చేశారు. ప్రజలను రెచ్చగొట్టి విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు.
తెలంగాణ రైతుల పరిరక్షణకు తెలంగాణ
రాష్ట్ర సమితి పోరాడుతుందని చెప్పారు.
0 comments:
Post a Comment