హైదరాబాద్:
ఇటీవల ఉప ఎన్నికలలో ఘోర
పరాజయం తర్వాత దాని నుండి బయటపడేందుకు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం ఆయన పార్టీ నేతలతో
నిత్యం సమావేశాలు, ఆందోళనలు, పర్యటనలు చేస్తున్నారు. అయితే అది మరిచిపోదామనుకున్న
బాబుకు బావమరిది నందమూరి బాలకృష్ణ, అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ల తీరు ఇబ్బందులను
కలిగిస్తుందని అంటున్నారు.
ఇప్పటి
వరకు 95 సినిమాలు పూర్తి చేసుకున్న బాలయ్య 2014లో వందో చిత్రం
పూర్తి చేయాలని చూస్తున్నారు. తన వందో చిత్రానికి
అప్పుడే సిఎం అని టైటిల్
కూడా పెట్టారు. ఆ చిత్రాన్ని సాధారణ
ఎన్నికలు జరగబోయే 14లో విడుదల చేయాలనే
ఉద్దేశ్యంతో ఉన్నారు. అదే సమయంలో జూనియర్
ఎన్టీఆర్ కూడా ఎమ్మెల్యే టైటిల్తో ఓ చిత్రాన్ని
విడుదల చేసే విధంగా ప్రయత్నాలు
చేస్తున్నారు.
బాలయ్య
తెలుగుదేశం పార్టీకి మంచి సపోర్టర్. జూనియర్
ఎన్టీఆర్ కూడా మావయ్య చంద్రబాబుపై
ఆసంతృప్తితో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడే. అయినప్పటికీ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్లు తెలుగుదేశం పార్టీలో
ప్రధాన పాత్ర పోషించేందుకు ఉవ్వీళ్లూరుతున్నారనే
ప్రచారం జరుగుతోంది. వారు పార్టీలో క్రియాశీలకంగా
ఉండాలని భావిస్తే బాబు కంటే తక్కువ
స్థాయిలో ఉండేందుకు సిద్ధపడే అవకాశాలు లేవని అంటున్నారు.
బాలయ్య,
జూనియర్ ఎన్టీఆర్లకు అభిమానులు పెద్ద
ఎత్తున ఉన్నారు. వారిని బాబు విస్మరించి పార్టీని
ముందుకు తీసుకు వెళ్లే పరిస్థితి లేదంటున్నారు. ఇప్పటికే బాలయ్య అభిమానులు అతనిని భవిష్యత్తు ముఖ్యమంత్రిగా భావిస్తున్నారు. ఎప్పటికైనా బాలకృష్ణ ముఖ్యమంత్రి అయితే చూద్దామనుకుంటున్నారు. ఇక 14లో
బాలయ్య వందో సినిమా తీయడం,
ఎమ్మెల్యేగా పోటీ చేయడం తదితర
పరిణామాలు అభిమానులలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
14లో బాలయ్య ఎంట్రీ ఇస్తే అభిమానులు ఖచ్చితంగా
బాబును పక్కకు పెట్టి బాలయ్యను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తారు.
బాలకృష్ణ
గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ప్రజలు కోరుకుంటే తాను ముఖ్యమంత్రిని అవుతానని
చెప్పారు. బాలయ్య వ్యాఖ్యలు చంద్రబాబు శిబిరంలో గుబులు పుట్టుస్తున్నాయని అంటున్నారు. బాలయ్య సిఎం పేరుతో సినిమా
తీసి ఎన్నికల సమయంలో విడుదల చేస్తే బాలయ్యకు అనుకూలంగా పెద్ద ఎత్తున పబ్లిసిటీ
అవుతుందనే ఆందోళన బాబు శిబిరంలో ఉందని
అంటున్నారు.
అయితే
మరికొందరు ఇలాంటి వాదనలను కొట్టి పారేస్తున్నారని తెలుస్తోంది. సిఎం అనేది రాజకీయాలకు
సంబంధించిన సినిమా కాదని, సిఎం అంటే కామన్
మ్యాన్ అని అర్థమని, చీఫ్
మినిస్టర్ అని కాదని చెబుతున్నారు.
ఇంకా స్క్రిప్ట్ కూడా సిద్ధం కాలేదని,
కేవలం పేరు మాత్రమే రిజిస్టర్
అయిందని చెబుతున్నారు. ఒక సాధారణ వ్యక్తి
సామర్థ్యాన్ని చాటే అంశంగా ఈ
చిత్రం ఉండి ఉండవచ్చునని అంటున్నారు.
బాలకృష్ణ సినిమాలను, రాజకీయాలను ముడిపెట్టే రకం కాదని, సిఎం
టైటిల్కు రాజకీయాలకు ఏమాత్రం
సంబంధం లేదని చెబుతున్నారు.
జూనియర్
ఎన్టీఆర్ ఎమ్మెల్యే విషయంలోనూ అదే చెబుతున్నారు. ఎమ్మెల్యే
అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి
అని మాత్రమే అని, ఈ టైటిల్కు రాజకీయాలకు ఎలాంటి
సంబంధం లేదని చెబుతున్నారు. అయితే
అధినేత చంద్రబాబు మాత్రం బాలయ్య 'సిఎం', జూనియర్ 'ఎమ్మెల్యే' చిత్రాలపై కామెంట్ చేయడానికి నిరాకరించినట్లుగా తెలుస్తోంది.
0 comments:
Post a Comment