పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన
‘గబ్బర్ సింగ్' చిత్రం భారీ కలెక్షన్లతో 81 ఏళ్ల
తెలుగు సినిమా చరిత్రను తిరగరాస్తున్న సంగతి తెలిసిందే. అయితే
నిర్మాతలు కలెక్షన్ల వివరాలు అధికారికంగా ప్రకటించక పోవడంతో గంధరగోళ పరిస్థితి నెలకొంది. కొన్ని రోజుల క్రితం 5వీక్స్
కలెక్షన్స్ రూ. 71.16 కోట్ల షేర్ సాధించినట్లుగా
చర్చించుకున్నారు. తాజాగా 50 రోజుల షేర్ వివరాలు
మార్కెట్ వర్గాల నుంచి రూ. 63.92 కోట్లుగా
వినపడుతోంది. అప్పుడేమో ఎక్కువగా, ఇప్పుడు ఈ లెక్క కాస్త
తగ్గి వినపడుతుండటం గమనార్హం. ఇందులో ఫేక్ ఏవో..? రియల్
ఏవో.? నిర్మాతలే బయటపెట్టాలి.
50 రోజుల
షేర్స్ ఏరియా వారిగా (ట్రేడ్
వర్గాల సమాచారం ప్రకారం)
నైజాం
- 20 కోట్లు
సీడెడ్
- 9 కోట్లు
వైజాగ్
- 5.75 కోట్లు
ఈస్ట్
- 3.7 కోట్లు
వెస్ట్
- 3.25 కోట్లు
కృష్ణా
- 3.17 కోట్లు
గుంటూరు
- 4.3 కోట్లు
నెల్లూరు
- 1.95 కోట్లు
కర్ణాటక
- 3.5 కోట్లు
రెస్టాఫ్
ఇండియా - 2 కోట్లు
ఓవర్సీస్
- 7.3 కోట్లు
వరల్డ్
వైడ్ 50 రోజుల షేర్ : రూ.
63.92 కోట్లు(రియలా..? ఫేకా? తేలాల్సి ఉంది)
పవన్
కళ్యాణ్, శృతి హాసన్ జంటగా
నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ
చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్
విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం
రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి,
వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్
కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ:
శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే,
మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.
0 comments:
Post a Comment