ఎన్నో
విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఎస్వీఆర్ మీడియా ప్రై.లి. అధినేత్రి
శోభారాణి తాజాగా ఇన్ ఎంటర్‌టైన్
సమర్పణలో వైడ్ యాంగిల్ క్రియేషన్స్
ప్రొడక్షన్స్ పతాకంపై అజిత్ కథానాయకుడుగా తమిళంలో
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘బిల్లా-2' చిత్రాన్ని ‘డేవిడ్ బిల్లా'గా తెలుగు ప్రేక్షకులకు
అందిస్తున్నవిషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ
వ్యాప్తంగా జులై 13న రిలీజ్ కాబోతోంది.
ఈ సందర్భంగా ఎస్.వి.ఆర్
మీడియా అధినేత్రి శోభారాణి మాట్లాడుతూ...‘అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘డేవిడ్ బిల్లా' చిత్రాన్ని జులై 13న ప్రపంచ వ్యాప్తంగా
1200 థియేటర్లలో తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి
రిలీజ్ అవుతోంది. యువన్ శంకర్ రాజా
సారథ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై
సూపర్ హిట్ అయింది. హైటెక్నిక్
వేల్యూస్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ
చిత్రం అజిత్ కెరీర్‌లోనే
బిగ్గెస్ట్ హిట్ అవుతుంది' అన్నారు.
అజిత్
సరసన పార్వతి ఒమనకుట్టన్ కథానాయికగా నటించిన ఈచిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను
మీనాక్షి దీక్షిత్ పోషించారు. ప్రభు, బృనా అబ్దుల్లా, రెహమాన్,
సుదాషు పాండే, శ్రీమాన్, శ్రీచరణ్, కృష్ణ కుమార్, మనోజ్
కె. జైన్ తదితరులు ఇందులో
ముఖ్యపాత్రల్ని పోషించారు. చక్రి తోలేటి, ఎరిక్
సెల్ బర్గ్‌లు కథను
సమకూర్చిన దీనికి శరత్ మాండవ, జాఫర్
అహ్మద్, ఇఆర్ మురుగన్‌లు
సంయుక్తంగా స్క్రీన్ ప్లేని వ్రాశారు.
సంగీతం:
యువన్ శంకర్ రాజా, పాటలు:
అనంత శ్రీరామ్, ఛాయా గ్రహణం: ఆర్
.డి. రాజశేఖర్, కళ: సెల్వకుమార్, ఎడిటింగ్:
సురేష్ ఆర్స్, ఫైట్స్: జైకా స్టంట్ టీమ్(కెచ కంప్యాడ్), నిర్మాత:
శ్రీమతి శోభారాణి, దర్శకత్వం: చక్రి తోలేటి.
0 comments:
Post a Comment