యూత్
హీరో నితిన్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్
ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్స్ బేనర్‌పై తెలుగు, తమిళ
భాషల్లో నిర్మిస్తున్న ‘కొరియర్ బోయ్ కళ్యాణ్' చిత్రం
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. జులై 10 నుంచి రెగ్యులర్ షూటింగ్
ప్రారంభం కానుంది. ప్రభుదేవా వద్ద అసోసియేట్‌గా
పని చేసిన ప్రేమ్ సాయి
ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ‘కొరియర్ బోయ్ కళ్యాణ్'గా,
తమిళ్‌లో ‘తమిళ సెల్వనుంతనియార
అంజలుం' పేరుతో ఈచిత్రం రూపొందబోతోంది. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్
షూటింగ్ ప్రారంభమవుతుంది.
ఈ చిత్రం గురించి నిర్మాత గౌతమ్ మీనన్ మాట్లాడుతూ..‘నా దర్శకత్వంలో తెలుగులో
వచ్చిన ‘ఏమాయ చేసావె' చిత్రాన్ని
ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు నితిన్‌తో నిర్మిస్తున్న ‘కొరియర్
బోయ్ కళ్యాణ్' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని
అలరించే అంశాలు ఉంటాయి. భాషలకతీతంగా అందరి అభినందనలు ఈచిత్రం
అందుకుంటుంది. లవ్, యాక్షన్, కామెడీ
అన్ని సమపాళ్లలో ఉన్న కథ ఇది.
కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.
నా గత చిత్రాల్లో అద్భుతమైన
పాటలు పాడిన కార్తీక్ ఈ
చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ముఖ్య పాత్రల్లో జైసంతానం,
విటివి గణేష్ నటిస్తున్నారు. ఇతర
నటీనటుల ఎంపిక జరుగుతోంది' అన్నారు.
నాని,
సమంత హీరో హీరోయిన్లుగా గౌతమ్
మీనన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఎటో వెళ్ళి పోయింది
మనసు' చిత్రం షూటింగ్ కావచ్చిన సందర్భంగా తను నిర్మించబోయే ‘కొరియర్
బోయ్ కళ్యాణ్' చిత్రం గురించిన విశేషాలు తెలియజేశారు గౌతమ్ మీనన్.
0 comments:
Post a Comment