శ్రీకాకుళం:
శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని నాగార్జున
అగ్రికెమ్ పరిశ్రమలో శనివారం భారీ ప్రమాదం సంభవించింది.
పరిశ్రమలోని రెండు రియాక్టర్లు పేలి
అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ పేలుళ్లు సంభవించిన
సమయంలో దాదాపు 200 మంది కార్మికులు ఉన్నట్లు
సమాచారం. అయితే, ఈ ప్రమాదంలో 40 మంది
దాకా గాయపడినట్లు చెబుతున్నారు.
క్షతగాత్రులను
రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిశ్రమ ఆవరణలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. పరిశ్రమకు
ఐదు కిలోమీటర్ల దట్టమైన పొగలు అలుముకున్నాయి. దాదాపు
15 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఎచ్చెర్ల జాతీయ రహదారిపై ఈ
ప్రమాదంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
మంటలను
ఆర్పడానికి అగ్నిమాపక దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
అయితే, పెద్దగా ఫలితం కనిపించడం లేదు.
ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని
ఆయన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని ఆదేశించారు.
అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం
గురించి తెలుసుకున్న జిల్లా మంత్రి కొండ్రు మురళి కర్నూలు నుంచి
వెంటనే ఎచ్చెర్లకు బయలుదేరారు. ఆయన కర్నూలు జిల్లా
పర్యటనలో ఉన్నారు. ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఆరు
కిలోమీటర్ల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
0 comments:
Post a Comment