మెహర్
రమేష్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న
విషయం తెలిసిందే. వెంకీ ఇందులో మాఫియా
డాన్ గా కనిపించబోతున్నారు. యునైటెడ్ మూవీస్
పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ
సరసన తాప్సీ నటించనుంది. ఇటీవలే స్విట్జర్లాండ్‌లో వెంకటేష్, తాప్సీలపై
రెండు పాటల్ని తెరకెక్కించారు. రాజు సుందరం నృత్యరీతులు
సమకూర్చారు. త్వరలో రామోజీ ఫిల్మ్‌సిటీలో మరో గీతాన్ని చిత్రీకరిస్తారు.
ఇందుకోసం అక్కడో భారీ సెట్‌ని
తీర్చిదిద్దుతున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ...'యాక్షన్ అంశాలకు ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. వెంకటేష్
హావభావాలు, వేషధారణ కొత్తగా కనిపిస్తాయి''అన్నారు. ఈ చిత్రంలో వెంకటేష్
తన శైలి మార్చారు. గెడ్డం...
కొత్త తరహా కేశాలంకరణతో కెమెరా
ముందుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి
మంచి క్రేజ్ వచ్చింది.
హీరో
శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో
నటించనున్నాడు. శ్రీకాంత్ సరసన మధురిమ నటిస్తోంది.
ఈ చిత్రానికి గోపీమోహన్ కథ అందిస్తుండగా, కోన
వెంకట్ సంభాషణలు సమకూర్చుతున్నాడు. థమన్ సంగీతం అందించనున్నారు.
మధురిమ, ఎమ్మెస్ నారాయణ, నాగబాబు, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మీనన్, ధర్మవరపు, ప్రభు తదితరులు నటిస్తున్నారు.
సంగీతం: తమన్.
ఇక వెంకటేష్ అన్న కొడుకు రానాతో
పరుచూరి ప్రసాద్ ఇప్పటికే నా ఇష్టం చిత్రాన్ని
పూర్తి చేసి విడుదల చేసారు.
అది భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.
వెంకటేష్ బాడీగార్డ్ చిత్రం యావరేజ్ గా ఆడిన నేపధ్యంలో
ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్టు కొట్టాలని చేస్తున్నారు. అలాగే వెంకటేష్.. దిల్
రాజు బ్యానర్ లో రూపొందుతున్న సీతమ్మ
వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేస్తున్నారు. మహేష్,వెంకటేష్ ఆ
చిత్రంలో అన్నదమ్ములుగా చేస్తున్నారు.
0 comments:
Post a Comment