మీ కిష్టమైన రెస్టరెంట్ కు లేదా పెళ్ళి
భోజనానికి లేదా స్నేహితుల పార్టీకి
వెళ్ళి బాగా పొట్టనిండా తినేశారు.
సాధారణంగా ఇది అందరకు జరుగుతూనే
వుంటుంది. భోజనంలో వంటకాలు రుచిగా వుంటే మరింత తినేస్తాం.
అంతా తినేసిన తర్వాత పొట్ట బరువనిపించినపుడు అధికంగా
తినేశామని, ఎలా తేలిక చేయాలా
అని ఆలోచిస్తాం. మరి ఆందోళన చెందకండి.
ఒక రోజు బాగా తినేసినంత
మాత్రాన ఆరోగ్యం చెడిపోతుందని భావించకండి. మరి అంత గట్టి
భోజనం చేసిన తర్వాత ఏం
చేయాలనేది చూడండి.
విశ్రాంతి
తీసుకోండి - సాధారణంగా కంటే కొంచెం ఎక్కువే
విశ్రాంతి తీసుకోండి. దీనితో మీ జీర్ణవ్యవస్ధ బాగా
పని చేస్తుంది. బాగా తిన్న తర్వాత
అలసట కలుగుతుంది. దానికి కారణం మీ బ్రెయిన్
ఎనర్జీ అంతా దానికి పంపుతుంది.
ఎర్ర రక్త కణాలు బ్రెయిన్
నుండి పంపబడి తిన్న ఆహారాన్ని బాగా
నలగకొట్టి పోషకాలను పీల్చుకోమని చెపుతుంది. అందుకనే మీరు కూర్చోవటం లేదా
పడుకోవటం వంటివి కొద్దినిమిషాలపాటు మంచి భోజనం తర్వాత
చేయాలి. నిద్రించకండి. 15 నుండి 20 నిమిషాలు మాత్రం విశ్రాంతి తీసుకోండి. అధికమైతే, శరీరంలో కొవ్వు నిల్వలు ఏర్పడతాయి.
నడక
- కావలసినదానికంటే అధికంగా తింటే, నిలబడటం కూడా కష్టమే. కాని
ఆ సోమరితనాన్ని వదలటానికి కొద్దిపాటి విశ్రాంతి తర్వాత నడవండి. అధిక బలం, ఎనర్జీ
అవసరం లేని శారీరక కదలికలు
చేయండి. ఎందుకంటే మీ ఎనర్జీ అంతా
ఆహారంజీర్ణానికి కావాలి. కనుక మీరు పరుగెత్తటానికి
బలం వుండదు. నడక జీర్ణ క్రియ
మెరుగుపరచి మీరు హాయి భావించేలా
చేస్తుంది.
గ్రీన్
టీ - అధిక భోజనం తర్వాత
జీర్ణ క్రియ మెరుగుపడేందుకు వేడి
గ్రీన్ టీ తాగండి. పొట్ట
బరువు తగ్గుతుంది. అల్లంటీ వంటివి కూడా తాగవచ్చు. డైటింగ్
చేసి ఒకేసారి అధిక భోజనం తినేవారు
కొద్దిరోజులు హెర్బల్ టీ తాగితే మంచిదే.
వేడి
నీరు తాగండి - బరువు తగ్గాలంటే, వేడి
నీరు తాగాలి. డైటింగ్ చేస్తూ అధిక భోజనం తీసుకుంటే,
గోరు వెనచ్చటి నీరు తాగండి. వెంటనే
తాగకండి. ఇరవై నుండి 30 నిమిషాల
తర్వాత తాగండి. జీర్ణక్రియ మరింత మెనరుగుపడాలంటే కొద్దిగా
నిమ్మరసం కలపండి. నిమ్మలో వుండే రసం కొవ్వు
కరిగిస్తుంది. జీర్ణక్రియ వేగిరం చేస్తుంది. గ్యాస్ రాకుండా చేస్తుంది.
మీరు
భోజనం అధికంగా తినేసినట్లయితే, దానిని సమం చేయటానికి ఈ
చిట్కాలు పాటించండి. అయితే, మరుసటి రోజు కూడా అధికంగా
తినకండి.
0 comments:
Post a Comment