Wednesday, May 23, 2012

Ys Jagan fires at CBI


హైదరాబాద్: తనను నెల 25 తేదీన విచారణకు రావాలని నోటీసు జారీ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బుధవారం సిబిఐపై తీవ్రంగా ప్రతిస్పందించారు. తప్పుడు ఆరోపణలతో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ను జైలుకు పంపించారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మేలు చేశారని చెప్పి నిమ్మగడ్డ ప్రసాద్ను జైలుకు పంపించారని ఆయన అన్నారు.

సిబిఐకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తప్పులు కనిపించవా అని ఆయన అడిగారు. కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం ఓడరేవుల వ్యవహారాల్లో చంద్రబాబును ఎందుకు విచారించరని ఆయన అడిగారు. ఏం జరిగినా ఉప ఎన్నికలు మాత్రం జరగాలని, ఉప ఎన్నికలు ఆగకూడదని ఆయన అన్నారు. తనకేం జరిగినా సంయమనం పాటించాలని ఆయన ప్రజలను కోరారు. తనపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర చేస్తున్నాయని, పార్టీల కుట్రలు ఫలిస్తాయో లేదో తెలియదని ఆయన అన్నారు. పార్టీలకు మాత్రం ప్రజలు ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

వచ్చే నెల 15 తేదీ వరకు సిబిఐ ముందు వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలని కోరుతూ వైయస్ జగన్ దాఖలు చేసిన లంచ్ మోషన్ను హైకోర్టు తిరస్కరించింది. నెల 25 తేదీన సిబిఐ ముందు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. దీంతో నెల 25 తేదీన జగన్ను సిబిఐ అరెస్టు చేసే అవకాశాలున్నాయనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇదే సమయంలో జగన్కు అరెస్టు భయం పట్టుకుందని, అందుకే కుట్రలు చేస్తున్నాయంటూ తమ పార్టీలను విమర్శిస్తున్నారని తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నాయకులు అంటున్నారు.

వైయస్ జగన్ నెల 25 తేదీన సిబిఐ ముందుకు రానున్న నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. నెల 29 తేదీ వరకు హైదరాబాదులో 144 సెక్షన్ విధిస్తూ హైదరాబాదు కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. నెల 28 తేదీన జగన్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా జగన్ హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.

జగన్ సిబిఐ ముందుకు రావడం వంటి కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో నిఘా వర్గాలు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ తన ఆస్తుల కేసులో మొదటిసారి సిబిఐ ముందుకు వస్తున్నారు. గతంలో కేసులో సాక్షిగా ఆయన సిబిఐ ముందుకు వచ్చారు.

0 comments:

Post a Comment

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget