హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల
శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ బుధవారం
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుండి తన ఉప
ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఆమె ఉదయం హైదరాబాదు
నుండి విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా నరసన్నపేటకు
బయలుదేరి వెళ్లారు. ఆమె లోటస్ పాండు
నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
అక్కడి
నుండి విమానంలో విశాఖకు చేరుకున్నారు. విశాఖ చేరుకున్న విజయమ్మకు
పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
విశాఖలోని ఎన్ఏడి జంక్షన్లోని దివంగతముఖ్యమంత్రి వైయస్
రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అటునుండి నరసన్నపేటకు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. ఆ నియోజకవర్గంలో ఉప
ఎన్నిక ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో వైయస్ విజయమ్మ ఉప
ఎన్నిక ప్రచారం రంగంలోకి దిగారు. ఆమె మొదటిసారి ఉప
ఎన్నికలు ప్రారంభిస్తున్న నరసన్నపేట నియోజకవర్గం ఉన్న శ్రీకాకుళం జిల్లాకు
రాజకీయపరంగా చాలా ప్రాధాన్యత ఉంది.
శ్రీకాకుళం జిల్లా నుండి ప్రచారం నిర్వహించిన
ముఖ్య నేతల జాబితాలో ఇప్పుడు
వైయస్ విజయమ్మ కూడా చేరిపోయారు.
స్వయంగా
వైయస్ విజయమ్మ భర్త, దివంగత ముఖ్యమంత్రి
వైయస్ రాజశేఖర రెడ్డి కూడా 2004లో తన పాదయాత్రను
శ్రీకాకుళం జిల్లా నుండే ప్రారంభించారు. 2004కు ముందు
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అప్పటి సాధారణ
ఎన్నికల్లో కాంగ్రెసు గెలిచి అధికారంలోకి రావడానికి వైయస్ పాదయాత్ర ఎంతో
ఉపయోగపడిందనే చెప్పవచ్చు. వైయస్ తన 1,600 కిలోమీటర్ల
పాదయాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండే ప్రారంభించారు.
2008లో
ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా తన ప్రజా
అంకిత యాత్రను శ్రీకాకుళం జిల్లా అరసవల్లి నుండి ప్రారంభించారు. ఆయన
చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. 2009 సాధారణ ఎన్నికలలో అప్పటి పిసిసి చీఫ్ డి శ్రీనివాస్
కూడా తన ఎన్నికల ప్రచారాన్ని
ఇచ్చాపురం నుండి ప్రారంభించారు. డిఎస్తో పాటు పలువురు
పార్టీ నేతలు అక్కడ బహిరంగ
సమావేశాలు, రోడ్డు షోలు నిర్వహించారు.
హీరో
జూనియర్ ఎన్టీఆర్ 2009 సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు.
ఆయన సైతం రాష్ట్రవ్యాప్తంగా నలభై
రోజుల పాటు తలపెట్టిన తన
ప్రచార యాత్రకు ఇచ్చాపురంలో శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లాలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు సొంత
గ్రామమైన నిమ్మకూరులోని ఆయన విగ్రహానికి నివాళులు
అర్పించిన అనంతరం జూనియర్ ఇచ్చాపురం నుండి తన ప్రచారాన్ని
ప్రారంభించారు.
0 comments:
Post a Comment