అల్లరి
నరేష్ తాజాగా పవన్ కళ్యాణ్ సూపర్
హిట్ చిత్రం గబ్బర్ సింగ్ ని స్పూఫ్
చేస్తున్నట్లు సమాచారం. అందులోని పెద్ద హిట్ డైలాగ్
'నాక్కొచెం తిక్కుంది..దానికో లెక్కుంది'ని తన తాజా
చిత్రం సుడిగాడులో పారడీ చేస్తున్నారు. ఆ
డైలాగ్ ఇలా సాగుతుంది..."నాకో
కుక్క ఉంది, దానికో బొక్క
ఉంది". ఇలా ఆ చిత్రంలో
మరికొన్ని డైలుగులను,మ్యానరిజంలను తన సుడిగాడు చిత్రంలో
స్పూఫ్ చేస్తున్నట్లు సమాచారం.
తమిళ
సూపర్ హిట్ తమిళ పదం
రీమేక్ గా రూపొందున్న ఈ
చిత్రాన్ని భీమినేని శ్రీనివాస రావు డైరక్ట్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో
వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు
ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ
చిత్రం ఈ నెలలో విడుదల
చేయనున్నారు.
'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్పై
100 సినిమాలు' అని పెట్టారు. ఈ
చిత్రంలో అల్లరి నరేష్ హిట్ చిత్రాల
పేరడీ చేస్తూ కథ నడుపుతూంటాడు. మోనాల్
గజ్జర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ
చిత్రానికి చంద్రశేఖర్.డి.రెడ్డి నిర్మాత.మోనాల్ గజ్జల్ ఇప్పటికే వెన్నెల వన్ అండ్ హాఫ్
చిత్రంలో చేసింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక్క
పాట మినహా షూటింగ్ పూర్తయింది.
వచ్చే నెలలో చిత్రం విడుదలకు
ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మక చిత్రాల్లో ఇదొక వైవిధ్యమైన ప్రయత్నం.
విజయవంతమైన చిత్రాల్లోని పలు సన్నివేశాల పేరడీతో
కథ సాగుతుంది. ప్రతి సన్నివేశం కూడా
ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విస్తుంది. అసలు ఈ కథలో
సుడిగాడు ఎవరు? అతని కథేమిటన్నది
తెరపైనే చూడాలి. ఇందులో నరేష్ నటన ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది''అన్నారు. అల్లరి నరేష్ కెరీర్ లో
ఈ చిత్రం మరో మైలు రాయిగా
నిలిచే అవకాశం ఉందంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత
భీమినేని డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం పై
మంచి అంచనాలే ఉన్నాయి.
పింకి
పింకి పోంకి ఫాదర్ హేడ్
ఎ డాంకీ అంటూ అల్లరి
నరేష్ పాడుతున్నారు. తన తాజా చిత్రం
'సుడిగాడు'కోసం ఆయన స్వయంగా
ఈ పాటను పాడారు. మొత్తం
ఓ ఫ్యామిలీ సాంగ్ గా ఈ
పాట తెరకెక్కుతోంది. చంద్రమోహన్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ,
చలపతిరావు, కోవై సరళ, హేమ
తదితరులు ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్
నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్, ఛాయాగ్రహణం: విజయ్ ఉలగనాథ్.
0 comments:
Post a Comment