సాధారణంగా
మనం డైటింగ్ లో వున్నపుడు తినే
ఆహారాలలో కేలరీలు లెక్కించుకుంటాం. నూడుల్స్ 200, సలాడ్ 50 మరియు పేస్ట్రీ లాంటి
ముట్టుకోము. అయితే, మరి కొన్ని కేలరీలను
మనం పరిగణలోనికి తీసుకోము. మరచిపోయి మరీ తినేస్తూ వుంటాం.
ఇవి ఎలా వుంటాయంటే, అలవాటుగా
తాగేవి మరియు తినేవిగా వుంటాయి.
డైటింగ్ లో మీ భోజనం
ఒకటి మాత్రమే కాదు. ఎన్నో వుంటాయి.
మనం చేసే పెద్ద పొరపాటు,
మన ఆహారాలను మార్చేస్తాం. కాని మన జీవన
విధానం మాత్రం అందుకనుగుణంగా మార్చుకోము. మరి డైటింగ్ చేస్తున్నా
చాలా కాలం వరకు బరువు
తగ్గకపోవటానికి గల కారణాలలో ఇది
ఒకటి.
ఎంత డైటింగ్ చేస్తున్నప్పటికి బరువు తగ్గటం లేదంటే,
బహుశ మీరు కింద తెలుపబడే
ఆహారాల కేలరీలు లెక్కించటంలేదని గ్రహించండి. మనం లెక్క వేయని
కేలరీలు ఎలా వుంటాయి?
అదనంగా
ఒక కప్పు కాఫీ - మనం
కాఫీ మరియు టీలు ఒక
అలవాటుగా తీసుకుంటాం. ఇది ప్రత్యేకించి మనం
ఆఫీస్ లో వుండగా లేదా
పని ప్రదేశం లో పని చేసేటపుడు
మనకు తెలియకుండా తాగేస్తాం. ఉదయం ఒకసారి, మరియు
పనిలో వుండి తీసుకునే కాఫీలు,
టీలు మనం లెక్కించం. ఒక
కప్పు కాఫీ...అంటే అందులోని షుగర్,
పాలు అన్నీ చేరి కనీసం
100 కేలరీలు వుంటుంది. మరి ఇవి తీసుకోకుండా
మీరు ఒక చిన్న ముక్క
చాక్లెట్ నోట్లో వేసుకుంటే సరిపోయేది కదా?
ఛీర్స్
అంటూ తాగే మందు - మనం
తాగే ఆల్కహాల్ కేలరీలుగా లెక్కపెట్టం. కాని లావు ఎక్కాలంటే,
ఆహారమే తినాలని లేదు. మీ వీక్
ఎండ్ పార్టీలు మీకు అధిక బరువు
చేకూరుస్తాయి. వోడ్కా పానీయం తప్పక కొవ్వు కలిగించే
పానీయం. ఒక గంట జిమ్
లో చేసిన కష్టమంతా ఒక్క
బీర్ బాటిల్ తో వేస్ట్.
పండ్లు
ఆరోగ్యమే...? పండ్లు మంచివే కాని వాటిలో కేలరీలు
కూడా అధికమే. మామిడిపండ్లు ఆరోగ్యం అంటూ తిన్నారంటే, మీ
బరువు తగ్గే ప్రోగ్రామ్ కు
గుడ్ బై చెప్పాల్సిందే. మామిడి,
ద్రాక్ష, మొదలైనవి కొవ్వు అధికం చేస్తాయి. మీరు
స్లిమ్ గా వుండాలంటే వీటిని
వదిలేయండి.
డైట్
సోడానే కదా? డైట్ సోడాయే
కదా అంటూ రెండు రోజుల్లో
ఒక డజన్ తాగేస్తే, అవి
మీకు లెక్కకు మించిన కేలరీలిస్తాయి. వాటిలో వుండే తీపి హాని
చేస్తుంది. సాధారణ సోడా ఒక్కటైనా, పరవాలేదు.
కాని డైట్ సోడా మాత్రం
మీకు హానిచేస్తుంది.
ఎయిర్
కండిషన్ - బరువు పెరుగుతున్నారంటే, మీరు
వాడే ఎయిర్ కండిషనర్ కూడా
కారణమే. మీ శరీరానికి సమమైన
ఉష్ణోగ్రత కావాలి. బాగా వేడిగా వుంటే,
అది మీలోని ఎనర్జీ రిలీజ్ చేసి చల్లపరుస్తుంది. మరి
చల్లగా వుంటే, అది కేలరీలు ఖర్చు
చేసి వేడి పుట్టిస్తుంది. అయితే
మీరు ఎల్లపుడూ 24 డిగ్రీల సెల్షియస్ లో కూర్చుంటే, మీ
శరీరం సోమరిగా అంటే లేజీగా తయారవుతుంది.
మరి సహజంగా మీరు కోల్పోవలసిన కేలరీలు
అలానే వుండి మీరు లావు
అయిపోతారు.
అనారోగ్యకరమైన
స్నాక్స్ వంటివి మానేస్తే అవి మీ బరువు
తగ్గించి శరీరాన్ని స్మార్ట్ చేయవు. మీరు కేలరీలను సైతం
వివిధ రకాలుగా నియంత్రించాలి.
0 comments:
Post a Comment