హైదరాబాద్:
అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో
శనివారం మెమో దాఖలు చేశారు.
ఈ నెల 25వ తేదీన
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనను విచారించకూడదని ఆయన
కోరారు. తనను కోర్టులో హాజరు
పరచాలని జైలు అధికారులను ఆదేశించాలని
ఆయన కోర్టును కోరారు.
ఈ నెల 25వ తేదీన
ఆయన జ్యుడిషియల్ రిమాండ్ ముగుస్తుంది. అయితే ఇదివరకు ఒకసారి
జగన్ రిమాండ్ ముగియడంతో జైలు అధికారులు ఆయనను
పోలీస్ వ్యాన్లో కోర్టుకు తీసుకుని
వెళ్లినందుకు జగన్ అభ్యంతరం వ్యక్తం
చేశారు. తాను ప్రత్యేక ఖైదీనని,
వేరే వాహనంలో తీసుకువెళ్ళాలని, లేకపోతే జైల్లోనే దీక్ష చేపడతానని అన్నారు.
ఆ తర్వాత నుంచి శాంతి భద్రతల
దృష్ట్యా జగన్ను వీడియో
కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణ జరుపుతూ వస్తోంది.
కాగా,
గత ఐదారు రోజుల నుంచి
సంభవిస్తున్న పరిణామాల దృష్ట్యా వాటికి సంబంధించిన అంశాలపై కోర్టులో స్పందించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
అందుకే జగన్ కోర్టులో మెమో
దాఖలు చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు
వైయస్ జగన్ను భౌతికంగా
అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
తమ ఆరోపణలను సమర్థించుకోవడానికి వారు సిబిఐ జాయింట్
డైరెక్టర్ లక్ష్మినారాయణ మొబైల్ ఫోన్ల కాల్ లిస్టును
విడుదల చేశారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది.
చంద్రబాల అనే మహిళ వైయస్సార్
కాంగ్రెసు నాయకుల తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆంధ్రజ్యోతి వైయస్సార్ కాంగ్రెసు నాయకుల తీరుపై తీవ్రంగా మండిపడుతూ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో వైయస్
జగన్ మెమో దాఖలుకు ప్రాధాన్యం
చేకూరిందని అంటున్నారు.
0 comments:
Post a Comment