హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
అక్రమాస్తుల కేసులో సిబిఐ బిసిసిఐ చైర్మన్
ఎన్ శ్రీనివాసన్కు గురువారం సమన్లు
జారీ చేసింది. ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో సిబిఐ ఆయనను విచారణకు
పిలిచింది. వచ్చేవారం తమ ముందు హాజరు
కావాలని ఆదేశించింది. వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రభుత్వ హయాంలో ఇండియా సిమెంట్స్కు నీటి కేటాయింపులో
ప్రయోజనం చేకూర్చారని, అందుకు ప్రతిగా ఇండియా సిమెంట్స్ వైయస్ జగన్ కంపెనీల్లో
పెట్టుబడులు పెట్టిందని సిబిఐ భావిస్తోంది.
ఇండియా
సిమెంట్స్తో పాటు పెన్నా
సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్లకు కూడా సిబిఐ నోటీసులు
జారీ చేసింది. తమ ముందు హాజరు
కావాలని వారిని ఆదేశించింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు
పెట్టినందుకు వాటికి సున్నంరాయి గనులను కేటాయించిన వైనంపై ప్రశ్నించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇండియా సిమెంట్స్కు నీటి కేటాయింపులపై
సిబిఐ గురువారం అప్పటి భారీ నీటి పారుదల
శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను సిబిఐ గురువారం ప్రశ్నించింది.
ఇతరు
రెండు సిమెంట్ కంపెనీలకు సున్నంరాయి గనుల కేటాయింపుపై ప్రశ్నించేందుకు
సిబిఐ మంత్రి ధర్మాన ప్రసాద రావుకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు
చెబుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రభుత్వ హయాంలో ధర్మాన ప్రసాద రావు రెవెన్యూ మంత్రిగా
పనిచేశారు.
బిసిసిఐ
చైర్మన్ అయిన శ్రీనివాసన్ చెన్నై
సూపర్ కింగ్స్ ఐపియల్ జట్టు యజమాని కూడా.
ఆయన ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్, మేనేజింగ్
డైరెక్టర్గా ఉన్నారు. ఉత్పత్తిని
రెండింతలు చేయడానికి వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రభుత్వ హయాంలో పెద్ద యెత్తున నదీజలాలను
ఇండియా సిమెంట్స్ పొందినట్లు భావిస్తున్నారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ ప్లాంట్లకు అదనపు నీటిని కేటాయిస్తూ
ప్రభుత్వం రెండు జీవోలను జారీ
చేసింది.
0 comments:
Post a Comment