విజయవాడ:
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని
కలిసి విజయవాడ ఫ్లై ఓవర్ నిర్మాణంపై
వివరించాలని అనుకున్న కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్కు నిరాశే ఎదురైంది.
చంద్రబాబును కలుసుకోకుండానే ఆయన సోమవారం సాయంత్రం
విజయవాడ నుంచి హైదరాబాదు బయలుదేరారు.
చంద్రబాబును కలిసేందుకు లగడపాటి చాలా ప్రయత్నమే చేశారు.
హైదరాబాదు
బయలుదేరుతారని భావించిన చంద్రబాబు కోసం లగడపాటి రాజగోపాల్
గన్నవరం విమానాశ్రయం వద్ద కాపు కాశారు.
అయితే, చంద్రబాబు పర్యటన షెడ్యూల్ మారింది. దాంతో చంద్రబాబు రాలేదు.
చంద్రబాబు రాత్రికి రైల్లో హైదరాబాదు బయలుదేరుతున్నట్లు తెలిసింది. దాంతో లగడపాటి హైదరాబాదు
బయలుదేరారు.
లగడపాటి
చంద్రబాబును కలిసేందుకు విజయవాడ మహాధర్నా వేదిక వద్దకు 108 వాహనంలో
బయలుదేరగా పోలీసులు ఆయనను అశోక స్తంభం
సెంటరులో అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త
పరిస్థితి తలెత్తింది. మరోవైపు చంద్రబాబును ఎలాగైనా కలుస్తానని చెప్పిన లగడపాటి విజయవాడ నుండి హైదరాబాదు వెళ్లే
అన్ని ఫ్లైట్ టిక్కెట్స్ను బుక్ చేశారని
సమాచారం.
చంద్రబాబు
ఏ విమానంలో హైదరాబాదు వెళితే అదే విమానంలో ఎక్కి
ఆయనకు ఫ్లై ఓవర్ గురించి
వివరించేందుకు ఆయన ఫ్లైట్ టిక్కెట్స్
అన్నీ బుక్ చేశారని తెలుస్తోంది.
ధర్నాను ముగించుకున్న చంద్రబాబు నాయుడు ఆ తర్వాత తిరువూరు
పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనను ముగించుకుని
చంద్రబాబు హైదరాబాదుకు విమానంలో బయలుదేరుతారని లగడపాటి భావించారు.
0 comments:
Post a Comment