వాయిదాల
మీద వాయిదాలు పడుతూ వస్తున్న రాజమౌళి
‘ఈగ' చిత్రాన్ని ఎట్టకేలకు జులై 6వ తేదీన
ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.
టాలీవుడ్ టాప్ హీరోల చిత్రాల
మాదిరి ఈచిత్రం కూడా గ్రాండ్గా
నెంబర్ ఆఫ్ థియేటర్లలో రిలీజ్
చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం వెర్షన్లు కలిపి ‘ఈగ'ను ఒకేసారి
1200 ప్లింట్లతో ప్రేక్షకులపైకి వదులుతున్నారు.
సమంత,
నాని, కన్నడ స్టార్ సుదీప్
ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్
కీలక పాత్రను పోషించనుంది. సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.
అలాగే ఈ సినిమాకి యం
యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మగధీర చిత్రానికి కెమెరామెన్గా పని చేసి
సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ చేశారు.
తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న
ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్
చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే ‘ఈగ' రూపంలో మరుజన్మ
ఎత్తిన ఆ కుర్రాడిని గత
జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ'గానే విలన్
పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ
ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన
ఓ మనిషిపై.. అదీ ఓ పరమ
క్రూరుడి పై ఆ ‘ఈగ'ఎలా గెలిచిందీ..ఆ
గెలుపు కోసం ఏమేం చేసిందీ'
అన్నదే క్లుప్తంగా ‘ఈగ' కథాంశం.
ఈగ చిత్రం గురించి రాజమౌళి ఆ మధ్య మాట్లాడుతూ....కథారచయిత నాన్నగారు 15 ఏళ్ల క్రితం 'ఈగ'
కథను అందించారు. ఈగపై సినిమాను నిర్మించాలంటే
ఎంతో రిస్క్తో కూడుకున్న పని
అన్నారు. 175 సెంటీమీటర్ల మనిషిని 0.75 సెంటీమీటర్ల ఈగ మధ్య సన్నివేశాలను
చిత్రీకరించడం ఊహించడానికే కష్టమన్నారు. ఇందుకు సాంకేతిక పరంగా ఎంతో కష్టపడాల్సి
వుంది. ప్రస్తుతం క్వాలిటీ వున్న చిత్రాలనే ప్రేక్షకులు
ఆదరిస్తున్నారని, అలాంటివి అందించాలంటే బడ్జెట్ ఎక్కువవుతుంది. చిత్రానికి దాదాపు రూ.30 కోట్లరూపాయలు ఖర్చయింది
అని వెల్లడించారు.
0 comments:
Post a Comment