హైదరాబాద్:
తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
త్వరలో జైలు నుండి బయటకు
వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్
విజయమ్మ శుక్రవారం అన్నారు. ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ తరఫున గెలిచిన పదిహేను
మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వైయస్
విజయమ్మ మీడియాతో మాట్లాడారు. నాడు రైతుల పక్షాన
నిలబడిన వారిని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు అని చెప్పారు.
ప్రజా
సమస్యలపై నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉద్యమిస్తుందన్నారు. రైతులు, ఇతర వర్గాల ప్రజలందరూ
తమ అభ్యర్థులను గెలిపించారన్నారు. తన భర్త, దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
ఆశయాలను సాధిస్తామని చెప్పారు. ప్రజలు తమ ఓటు ద్వారా
జగన్ను నిర్దోషిగా నిరూపించారని,
త్వరలో లీగల్గా కూడా
బయటకు వస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం
చేశారు.
అంతకుముందు
ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో గెలుపొందిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. వైయస్
విజయమ్మ శాసనసభా పక్ష నేతగా ఎన్నికై
తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చారు. భవిష్యత్తులో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆమె నూతన ఎమ్మెల్యేలతో
చర్చించినట్లుగా తెలుస్తోంది. అనంతరం వారందరితో కలిసి విజయమ్మ బస్సులో
అసెంబ్లీకి చేరుకున్నారు. అక్కడ ప్రమాణ స్వీకారం
చేశారు.
అసెంబ్లీకి
బయలుదేరే ముందు విజయమ్మ మాట్లాడుతూ..
తమ పార్టీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోమని చెప్పారు. ప్రతి ప్రజా సమస్య
పైనా తాము ఖచ్చితంగా స్పందిస్తామని
చెప్పారు. తమ పార్టీ అభ్యర్థులను
గెలిపించిన వారందరికీ చేతులెత్తి జోడిస్తున్నానని చెప్పారు.
0 comments:
Post a Comment