హైదరాబాద్:
ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన
తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని
అందరూ భావించారు. అయితే ప్రస్తుతం మాత్రం
అంతటా సైలెన్స్గా ఉంది. తమ
వైపుకు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నుండి భారీగా వలసలు
ఉంటాయని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు, ఉప ఎన్నికల తర్వాత
బ్రహ్మాండం బద్దలవుతుందా అని ప్రశ్నించిన కాంగ్రెసు,
ఎమ్మెల్యేల పార్టీ మార్పులపై ఒంటి కాలిపై లేచిన
తెలుగుదేశం పార్టీ... ఇలా అన్నీ పార్టీలలో
ప్రస్తుతం మౌనం రాజ్యమేలుతోంది.
ఈ మౌనం తుఫాను ముందు
ప్రశాంతతా లేక నిజంగానే అంతా
సద్దుమణిగిందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
ఉప ఎన్నికలలో తమ పార్టీ ఘన
విజయం తర్వాత కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నుండి వలసలు ఉంటాయని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అంతకుముందు ఘంటాపథంగా
చెప్పారు. తమతో కాంగ్రెసుకు చెందిన
దాదాపు నలభై మంది, తెలుగుదేశం
పార్టీకి చెందిన నలుగురైదురుకు ఎమ్మెల్యేలతో నిత్యం టచ్లో ఉన్నారని
వారు చెప్పారు.
వారు
ఏ క్షణంలోనైనా జగన్కు జై
అంటారని, ఉప ఎన్నికల తర్వాత
కాంగ్రెసు, టిడిపిలు ఖాళీ కావడం ఖాయమని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు హెచ్చరించారు. ఇంకొందరు
ప్రభుత్వం పడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. బైపోల్సులో గెలిచిన అనంతరం శనివారం నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్
రెడ్డి త్వరలో రాష్ట్రపతి పాలన వస్తుందని చెప్పారు.
అయితే ఇప్పటి వరకు మాత్రం రాష్ట్రంలో
ఎలాంటి అలజడి కనిపించలేదు. ఏ
ఒక్క ఎమ్మెల్యే కూడా జగన్ వైపు
వెళ్లేందుకు సిద్ధంగా లేనట్లుగా కనిపిస్తోంది.
ఉప ఎన్నికలకు ముందు జగన్ పార్టీ
నేతలు రాష్ట్రంలో ఏదో జరగబోతుందని ఊదరగొట్టారని,
కానీ తీరా చూస్తే అవన్నీ
వట్టి మాటలుగానే కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుత
పరిస్థితులు బేరీజూ వేసుకొని వారి వ్యాఖ్యలు చూస్తుంటే
ఉప ఎన్నికలలో మంచి మెజార్టీ సాధించిందుకే
వారు వ్యూహాత్మకంగా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు.
తొలి నుంచి జగన్ వైపు
వెళుతున్న ఎమ్మెల్యేలను గమనించినా ఇది అర్థమవుతుందని అంటున్నారు.
జగన్ అరెస్టు తర్వాత ఉప ఎన్నికలకు ముందు
కాంగ్రెసు, టిడిపిల నుండి భారీ ఎత్తున
వలసలు ఉంటాయనే ప్రచారం జోరుగా జరిగింది.
ఆ ప్రచారం నిజమా అన్నట్లు ఏలూరు
ఎమ్మెల్యే ఆళ్ల నాని, బొబ్బిలి
ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు,
మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి జగన్ చుట్టూ చక్కర్లు
కొట్టారు. దీంతో జగన్ వైపు
వెళ్లేందుకు చాలామంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారనే అందరూ భావించారు. అయితే
ఆళ్ల నాని, బాలనాగి రెడ్డిలు
తొలుత జగన్ వైపు ఉండి
ఆ తర్వాత మళ్లీ సొంత గూటికి
చేరుకున్న వారు. జగన్ అరెస్టయ్యాక
వారు మరోసారి జగన్ పార్టీలోకి వెళుతున్నట్లు
ప్రకటనలు చేశారు.
అయితే
ఇదంతా వ్యూహాత్మకంగా జరిగి ఉండవచ్చునని పలువురు
అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనకు అండగా ఉంటున్న
ఎమ్మెల్యేలను జగన్ కాంగ్రెసు, టిడిపిల
వైపు పంపిస్తూనే.. అవసరం వచ్చినప్పుడు వారితోనే
తాము జగన్ వైపు వెళుతున్నట్లు
ప్రకటన చేయిస్తూ.. ప్రజల్లో తన వైపుకు ఎక్కువ
మంది ఎమ్మెల్యేలు వస్తున్నారనే భ్రమ కల్పిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు.
ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఏదో జరుగుతుందని చెప్పినప్పటికీ
అంతా సైలెంట్గా ఉండటాన్ని బట్టి
చూస్తుంటే జగన్ వ్యూహాత్మకంగా నడుచుకుంటున్నారనే
అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే
తుఫాను ముందు ప్రశాంతత కూడా
కావొచ్చుననే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఫలితాలు విడుదలై రెండు రోజులు మాత్రమే
అయిందని, ఇప్పుడు అందరూ రాష్ట్రపతి ఎన్నికల
హడావుడిలో ఉన్నందున పరిస్థితి అంతా నిశ్శబ్దంగా ఉందని,
రాష్ట్రపతి ఎన్నికల అనంతరం ఏదైనా జరగవచ్చుననే అనుమానాలు
కూడా వ్యక్తమవుతున్నాయి. అంతకంటే ముందు జరిగినా ఆశ్చర్య
పోవాల్సిన అవసరం లేదంటున్నారు.
0 comments:
Post a Comment