'మగధీర'
చేసేప్పుడు గ్రాఫిక్స్ విషయంలో చాలా తెలిసిందని అనుకున్నాననీ,
కానీ 'ఈగ' చేస్తుంటే నేను
తెలుసుకుంది చాలా తక్కువనీ, తెలుసుకోవాల్సింది
చాలా ఎక్కువనీ అర్థమైందని రాజమౌళి అన్నారు. నాని, సమంత, సుదీప్
ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి
రూపొందిస్తున్న 'ఈగ' చిత్రం జూలై
6న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఏర్పుటు
చేసిన మీడియా సమావేశంలో ఆయన ఇలా వివరించారు.
అలాగే
ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ వీడియో సాంగ్ను విడుదల చేశారు.
'నా పేరు నాని, నేను
ఈగనైతే గానీ' అనే టైటిల్
సాంగ్ను హీరో నాని
బృందంపై చిత్రీకరించారు. ఈ పాటను ప్రమోషనల్
సాంగ్గా ఉపయోగిస్తున్నామనీ, చిత్రంలో ఈ
పాటను 'ఈగ'పై తీశామనీ
రాజమౌళి చెప్పారు. డి. సురేశ్బాబు
సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ
చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సంగీత
దర్శకుడు ఎం.ఎం. కీరవాణి
మాట్లాడుతూ "ఈ సినిమాలోని ప్రతి
ఫ్రేములోనూ దర్శకుని శ్రమ కనిపిస్తుంది. తను
అనుకున్నది రాజమౌళి చెయ్యగలిగాడు. రీరికార్డింగ్ అయిపోయి నెలపైనే అయ్యింది. ఇప్పుడు గ్రాఫిక్ వర్క్ కూడా అయిపోవచ్చింది.
నేను విలన్ పాత్రలకు సంబంధించి
కోట శ్రీనివాసరావుకు వీరాభిమానిని. 'ఈగ' చూసి సుదీప్కు వీరాభిమానినైపోయా. అతనిలాంటి నటులు
ఇవాళ చాలా తక్కువమంది ఉన్నారు''
అని చెప్పారు.
హీరో
నాని మాట్లాడుతూ "ఈ సినిమా ఎప్పుడు
విడుదలవుతుందా అనే ఉత్కంఠతతో ఉన్నా.
రాజమౌళి ఈజ్ రజనీకాంత్ ఆఫ్
తెలుగు సినిమా. లేట్గా వచ్చినా
లేటెస్ట్గా వస్తారు. ఇప్పటిదాకా
భారతీయ తెరపైనే కాదు, అసలు వెండితెర
మీదే ఇలాంటి సినిమా రాలేదనేది నా అభిప్రాయం'' అని
తెలిపారు.
సమర్పకుడు
సురేశ్బాబు మాట్లాడుతూ "ఈ
చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో
దాదాపు 1200 ప్రింట్లతో విడుదల చేస్తున్నాం. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తోనూ
ప్రింట్లు వేస్తున్నాం. ఈ సినిమాకి రాజమౌళి
ఎంతో శ్రమించాడు. ఇందులోని యానిమేషన్ గ్రాఫిక్స్ ఎంతో క్లిష్టమైనవి. అవి
చాలా బాగా వచ్చాయి'' అన్నారు.
0 comments:
Post a Comment