హైదరాబాద్:
రాజకీయ నేతలు, పోలీసులు ఉన్నతాధికారులు అర్ధరాత్రుల్లు ఫోన్ చేసి తనను
వేధించే వారని వ్యభిచార కుంభకోణంలో
ఇరుక్కున్న వర్ధమాన నటి తారా చౌదరి
చెప్పారు. ఆమె ఆదివారం ప్రముఖ
తెలుగు టివి ఛానల్ సాక్షితో
మాట్లాడారు. పోలీసులతో పాటు బడా నేతలు
కావాలనే తనను వ్యభిచారం కేసులో
ఇరికించారని ఆమె ఆరోపించారు. జైలు
నుండి బయటకు వెళ్లాక వాస్తవాలు
వెల్లడిస్తే తన నగ్న దృశ్యాలు
బయటపెడతానని పోలీసులు బెదిరించారని ఆమె వాపోయారు.
నేతలు,
పోలీసు ఉన్నతాధికారులు తనను వేధించే వారని
తెలిపింది. బూతు ఎస్సెమ్మెస్లు
కూడా పంపేవారని చెప్పారు. వీరిలో శాసనసభ్యులు కూడా ఉన్నారని ఆమె
చెప్పారు. తనకు ప్రాణహాని ఉన్నా
పెద్దల బాగోతం బయటపెడతానని తారా చౌదరి స్పష్టం
చేశారు. తాను నిందితురాలిని కాదని,
బాధితురాలిని మాత్రమే అని ఆవేదన వ్యక్తం
చేశారు.
కాగా
తనను కొందరు రాజకీయ నాయకులు వాడుకున్నారని తారా చౌదరి గతంలోనూ
మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. తాను
ఎలాంటి తప్పు చేయలేదని ఆమె
అప్పుడు చెప్పింది. కావాలనే తనను వ్యభిచారం కేసులో
ఇరికించారని ఆమె ఆరోపించింది. తనకు
చంపుతానని పలు బెదిరింపులు వస్తున్నాయని
చెప్పింది. తన వద్ద ఆధారాలు
ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని
బయట పెడతానని తెలిపింది. తాను అమాయకురాలిని అని
పేర్కొంది.
తాను
సినీ ఆర్టిస్టును కాబట్టి సినిమా వాళ్లతో సంబంధాలు ఉంటాయని తెలిపింది. తనను కొందరు రాజకీయ
నేతలు వాడుకున్నారని చెప్పింది. సమయం వచ్చినప్పుడు వారి
గుట్టు బయట పెడతానన్నది. తాను
అమ్మాయిలను వ్యభిచార వృత్తిలోకి లాగాననే ఆరోపణలను ఆమె ఖండించింది. తాను
ఏ అమ్మాయిని వ్యభిచార వృత్తిలోకి లాగలేదని తెలిపింది. డిజిపి, హోంమంత్రి రక్షణ కల్పిస్తే అన్ని
విషయాలు బయట పెడతానని చెప్పింది.
తన లాప్టాప్లో
ఏమీ లేదని తెలిపింది. తాను
నిర్దోషినని, సిబిఐ విచారణ జరిగితే
తాను కేసులోంచి బయటపడతాననే నమ్మకం ఉందన్నారు. తనకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో
ప్రాణభయముందని చెప్పింది. పోలీసు విచారణపై తనకు నమ్మకం లేదని,
సిబిఐ విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుందన్నారు. ఉద్యోగాలు, సినిమా అవకాశాల పేరిట తారా చౌదరి
అమ్మాయిలను వ్యభిచార వృత్తిలోకి దింపుతుందనే ఆరోపణలపై అరెస్టయి ఆ తర్వాత బెయిల్
పైన విడుదలయిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment