హైదరాబాద్:
ఉప ఎన్నికల ఘన విజయం నేపథ్యంలో
తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని బెయిల్ పైన జైలు నుండి
బయటకు తీసుకు రావడమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తదుపరి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అక్రమాస్తుల కేసులో జగన్ ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారు.
ఆయనకు కోర్టు ఈ నెల 25వ
తారీకు వరకు జ్యూడిషియల్ రిమాండ్
విధించింది. ఉప ఎన్నికల గెలుపు
తర్వాత జగన్ బెయిల్ లక్ష్యంగా
వైయస్సార్ కాంగ్రెసు ప్రయత్నాలు చేయనుందని తెలుస్తోంది.
సమాచారం
మేరకు... ఆ పార్టీ గౌరవ
అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ త్వరలో
ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ప్రధానమంత్రి మన్మోహన్
సింగ్తో సహా పలువురు
రాజకీయనేతలను కలవనున్నారు. జగన్ కేసు విషయమై
వారితో చర్చించనున్నారని తెలుస్తోంది. జగన్ కేసులో మద్దతు
కోసం పలువురు జాతీయ పార్టీ నేతలను
ఆమె కలవనున్నారని తెలుస్తోంది. ఉప ఎన్నికలలో గెలుపు
ద్వారా జగన్ పైన కక్ష
సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారని,
జగన్కు బెయిల్ లభించకుంటే
తాము ప్రజల వద్దకు న్యాయం
కోసం వెళ్తామని ఆ పార్టీ నేతలు
చెబుతున్నారు.
విజయమ్మ
ప్రధానిని కలిసి సిబిఐ విచారణ
పారదర్శకంగా, వేగవంతంగా ఉండేలా చూడాలని కోరనున్నారు. కేసు విచారణ వేగవంతంగా,
పారదర్శకంగా ఉండాలంటే సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారించాలని
వైయస్సార్ కాంగ్రెసు డిమాండ్ చేస్తోంది. కాంగ్రెసు పార్టీ ఉద్దేశ్య పూర్వకంగా జగన్ కేసును చాలాకాలం
సాగదీసే ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ నేతలు
అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెసు పెద్దల సూచనల మేరకే ప్రస్తుత
సిబిఐ దర్యాఫ్తు జరుగుతోందని జగన్ పార్టీ నేతలు
భావిస్తున్నారు. అందుకే వారు సిట్టింగ్ జడ్జి
విచారణ డిమాండ్ చేస్తున్నారు.
శనివారం
విజేతలలో 9 మంది జైలులో జగన్ను కలిశారు. ఈ
సందర్భంగా జగన్ ఫలితాల పట్ల
సంతోషం వ్యక్తం చేశారు. అయితే రామచంద్రాపురం, పరకాల,
నర్సాపురంలలో ఓటమిపై ఆయన వారితో చర్చించారు.
ముఖ్యంగా రామచంద్రాపురం, పరకాల విషయమై ఆయన
అసంతృప్తితో ఉన్నారట. రామచంద్రాపురం నుండి పిల్లి సుభాష్
చంద్రబోసు, పరకాల నుండి కొండా
సురేఖ మొదటి నుండి జగన్కు అండగా ఉన్నారు.
ప్రధానంగా వారి ఓటమి ఆయనను
తీవ్రంగా కలచి వేసిందంటున్నారు. జగన్
కోసం వారు మంత్రి పదవులను
సైతం వదులుకున్నారు. సురేఖ, చంద్రబోసును ప్రత్యేకంగా ఫోన్ ద్వారా పలకరించాలని
జగన్ తన తల్లి విజయమ్మకు
సూచించారు.
0 comments:
Post a Comment