కర్నూలు/తిరుపతి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు వైయస్
జగన్మోహన్ రెడ్డి పార్టీ రాజంపేట శాసనసభ్యుడు గుర్నాథ్ రెడ్డి వాహనాన్ని ఆదివారం టోల్ ప్లాజా వద్ద
అడ్డుకున్నారు. ఇది కాసేపు ఉద్రిక్తతకు
దారి తీసింది. గుర్నాథ్ రెడ్డి కారును కర్నూలు జిల్లా ఆలంపూర్ టోల్ గేటు వద్ద
సిబ్బంది నిలిపివేశారు. కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ లేకపోవడంతో టోల్ ఫీజు చెల్లించాలని
సిబ్బంది ఎమ్మెల్యేను అడిగారు.
తాను
ఎమ్మెల్యేనని గుర్నాథ్ రెడ్డి సిబ్బందికి చెప్పారు. స్టిక్కర్ లేకపోవడంతో టోల్ ఫీజు చెల్లించాలని
వారు పట్టుబట్టారు. దీంతో గుర్నాథ్ రెడ్డి
రహదారి పైనే బైఠాయించారు. ఆందోళన
చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత
చోటు చేసుకుంది. ఇది తెలిసిన పోలీసులు
రంగంలోకి దిగారు. వారు జోక్యం చేసుకొని
గుర్నాథ్ రెడ్డిని అక్కడి నుండి వెళ్లేందుకు అనుమతించడంతో
పరిస్థితి సద్దుమణిగింది.
కాగా
ప్రజల వద్దే ఉంటూ ప్రజా
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తమ
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
సూచించారని తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతిలో అన్నారు. జగన్ ఆదేశాల మేరకు
వార్డు బాట చేపట్టానని, సమస్యల
పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని
చెప్పారు. నిధుల విషయంలో ప్రభుత్వం
కక్ష సాధింపునకు పాల్పడితే మెడలు వంచుతామన్నారు. కాంగ్రెసుకు
ఓట్లు వేయలేదని ఆ పార్టీ నేతలు
కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వారికి తగిన బుద్ధి చెబుతామన్నారు.
విజయవాడ
పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పిట్టల దొర వేషాలు, కాకి
లెక్కలు మానుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జలీల్ ఖాన్
విజయవాడలో హితవు పలికారు. జగన్కు ఉన్నది సానుభూతి
కాదని ప్రజాధరణ అన్నారు. తాజా ఉప ఎన్నికలలో
గెలిచిన వారు 2009 ఎన్నికల కంటే 30 శాతం ఓట్లు అధికంగా
తెచ్చుకున్నారన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ బొమ్మతో తిరిగిన
కాంగ్రెసుకు రెండు సీట్లే వచ్చాయన్నారు.
0 comments:
Post a Comment