హైదరాబాద్:
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
హయాంలో జరిగిన అవకతవకలపై కాంగ్రెసు పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి.హనుమంత
రావు ఆదివారం అన్నారు. వైయస్ హయాంలో సేకరించిన
భూములను తిరిగి దళితులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
అలా అయితే తమకు కాంగ్రెసు
అండగా ఉందని ప్రజలు భావిస్తారన్నారు.
ఇటీవల
జరిగిన ఉప ఎన్నికలలో ఓటమికి
మావాళ్లే కారణమని ఆయన అన్నారు. మావాళ్లే
పార్టీని ఓడించారన్నారు. పార్టీ సహచరులు విజయావకాశాలను దెబ్బతీశారని ఆరోపించారు. జనాల్లో తిరగక పోవడం వల్లే
ప్రభత్వ పథకాలు, సమస్యల పట్ల నేతలకు అవగాహన
తగ్గిందని అన్నారు. రాజకీయాలలో సానుభూతి ఎక్కువ కాలం నిలవదన్నారు.
ఉప ఎన్నికలలో వచ్చిన ఫలితాలపై అధిష్టానం విశ్లేషణ చేసుకోవాలని సూచించారు. నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అలా
చేస్తే కార్యకర్తలలో ఉత్సాహం వస్తుందన్నారు. ప్రజల్లోకి వెళితేనే పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని
చెప్పారు. జగన్ పార్టీ అభ్యర్థులు
సానుభూతితోనే గెలిచారని, అది ఎక్కువ కాలం
ఉండదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరకాల అభ్యర్థి కొండా
సురేఖకు భారతీయ జనతా పార్టీ మద్దతిచ్చిందని
విమర్శించారు. పార్టీ పటిష్టతకు మేథోమథనం జరగాలన్నారు.
రాజకీయాలలో
గెలుపోటములు సహజమేనని మాజీ మంత్రి షబ్బీర్
అలీ వేరుగా అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం
విలేకరులతో మాట్లాడారు. గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం
చేసే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు చెప్పారు.
0 comments:
Post a Comment