విజయనగరం:
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలనుకున్న విజయనగరం జిల్లా పార్వతీపురం శాసనసభ్యురాలు సవరపు జయమణి ఇప్పుడు
మనసు మార్చుకున్నారు. ఇటీవల జరిగిన ఉప
ఎన్నికలకు ముందు.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల
శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పాయకరావుపేట
నియోజకవర్గంలో ప్రచారంలో ఉండగా జయమణి వెళ్లి
ఆమెను కలిశారు.
విజయమ్మకు
తన సంఘీభావాన్ని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీలో
చేరిన సుజయ కృష్ణ రంగారావు
ప్రోద్భలంతో ఆమె అప్పుడు ఆ
నిర్ణయం తీసుకున్నారట. అయితే ఆ తర్వాత
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆమెతో
మాట్లాడారు. బొత్సది అదే జిల్లా. బొత్స
మాట్లాడటంతో ఆమె వెనక్కి తగ్గినట్లుగా
తెలుస్తోంది. దీంతో జగన్ పార్టీలోకి
వెళ్లాలన్న తన నిర్ణయాన్ని ఆమె
మార్చుకున్నారు.
జయమణి
ఆదివారం తన అనుచరులతో హైదరాబాదు
బయలుదేరారు. కాగా ఇటీవల బొత్స
జిల్లాకు చెందిన బొబ్బిలి శాసనసభ్యుడు సుజయ కృష్ణ రంగారావు
కాంగ్రెసు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీలో
చేరిన విషయం తెలిసిందే. ఆయన
తర్వాత అదే జిల్లా నుండి
మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెసుకు గుడ్ బై చెప్పనున్నట్లు
ప్రచారం జరిగింది. అందులో పార్వతీపురం శాసనసభ్యురాలు సవరపు జయమణి కూడా
ఉన్నారు.
ఆమె రంగారావుతో ఈ విషయంపై చర్చలు
జరిపినట్లుగా ప్రచారం జరిగింది. అప్పుడు రంగారావుతో పాటు జయమణి కూడా
హైదరాబాదు వచ్చి వైయస్ జగన్ను కలవాల్సి ఉంది.
కానీ అర్థాంతరంగా ఆమె ఆగిపోయారట. ఆ
తర్వాత ఆమె రంగారావుతో చర్చలు
జరిపారట.
0 comments:
Post a Comment