హైదరాబాద్:
సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ
- లీడ్ ఇండియా కార్యకర్త వాసిరెడ్డి చంద్రబాలల కాల్ లిస్ట్ అంశంపై
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. కాల్ డేటాను తాము
సేకరించలేదని వారు ఆదివారం చెప్పారు.
తాము కోర్టులో ఎవరో వేసిన పిటిషన్
ఆధారంగా తీసుకున్నామని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శోభా నాగి రెడ్డిలు
కాల్ లిస్టు పైన ఆదివారం స్పందించారు.
తారా
చౌదరి కాల్ లిస్టు బయటపెట్టగా
లీడ్ ఇండియా కార్యకర్త వాసిరెడ్డి చంద్రబాల కాల్ లిస్టు బయట
పెడితే తప్పేమిటని కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి ఆదివారం ప్రశ్నించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)
జెడి లక్ష్మీ నారాయణ కాల్ లిస్టును తాము
సేకరించలేదని చెప్పారు.
ఎవరో
కోర్టులో సమర్పించిన పబ్లిక్ డాక్యుమెంటును తాము తీసుకున్నామని చెప్పారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని
భౌతికంగా నిర్మూలించే కుట్ర జరుగుతోందని ఆయన
అనుమానం వ్యక్తం చేశారు. అందుకే తాము మాట్లాడుతున్నామని చెప్పారు.
సిబిఐ జెడి - చంద్రబాల కాల్ లిస్టు విడుదల
విషయాన్ని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని
ఆయన మండిపడ్డారు.
లీడ్
ఇండియా ముసుగులో జగన్ పైన కుట్ర
జరుగుతోందని ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి
అనుమానం వ్యక్తం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి
అభిమానులు వివిధ సంస్థలలో పని
చేస్తుంటారని చెప్పారు. వాళ్లంతా తమకు సమాచారం అందిస్తుంటారని
చెప్పారు. సిబిఐ జెడి కాల్
లిస్ట్ వ్యవహారంలో పోలీసు అధికారులపై కొంతమంది కక్ష కట్టారని ఆరోపించారు.
0 comments:
Post a Comment