తన తండ్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై,
తమ కుటుంబంపై కోలా కృష్ణమోహన్ అనే
వ్యక్తి చేసిన ఆరోపణలపై నారా
లోకేష్ స్పందించారు. యూరో లాటరీ తగిలిందంటూ
పలుపురిని మోసం చేసిన కోలా
కృష్ణమోహన్ చంద్రబాబు నాయుడిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
చంద్రబాబు విదేశీ ఖాతాల నెంబర్లంటూ కొన్ని
నెంబర్లు ఇచ్చారు. నారా లోకేష్ తన
వద్ద 35 లక్షల రూపాయలు తీసుకున్నారని
మాత్రమే కాకుండా ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు
చేశారు.
కోలా
కృష్ణమోహన్ ఆరోపణలపై నారా లోకేష్ మైక్రో
సైట్ ట్విట్టర్లో పలు ప్రశ్నలు
వేశారు. కోలా ఆరోపణలను ఖండించారు.
కోలా ఆరోపణలపై పలుపురు తనను ప్రశ్నించడంతో లోకేష్
ట్విట్టర్లో వివరణ ఇచ్చారు.
ఆ ఖాతాలు తన తండ్రివి, తన
కుటుంబ సభ్యులవని చెప్పడానికి డాక్యుమెంటరీ సాక్ష్యాలు ఏవీ లేవని ఆయన
అన్నారు. ఆ ఖాతా నెంబర్లు
అతనికి ఎక్కడ దొరికాయని లోకేష్
అడిగారు. ఆర్టిజిఎస్ రుజువులు ఎందుకు చూపలేకపోతున్నాడని ఆయన అడిగారు.
కోలా
కృష్ణమోహన్ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ
విడుదల చేసిన ప్రకటనను వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి
చెందిన సాక్షి దినపత్రిక ప్రచురించింది. సాక్షి టీవీలో కూడా కోలా ప్రకటనను
ప్రసారం చేసింది. ఒకసారి మీడియా సమావేశం పెట్టి కోలా చంద్రబాబుపై తీవ్ర
ఆరోపణలు చేశారు. మరోసారి ప్రకటన విడుదల చేశారు.
కోలా
వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు ఖండించడమే కాకుండా సాక్షి మీడియాపై తీవ్రంగా మండిపడ్డారు. కోలా చెప్పిన పేర్లు
గల వ్యక్తులు ఊళ్లోనే లేరంటూ రామోజీరావుకు చెందిన ఈనాడు దినపత్రిక ఓ
వార్తాకథనాన్ని ప్రచురించింది. మొత్తం మీద, మీడియా, పొలిటికల్
వార్ గరం గరంగా నడుస్తోంది.
0 comments:
Post a Comment