సినిమాల
విడుదల తేదీలు
శకుని-
జూన్ 22
డేవిడ్
బిల్లా - జూన్ 22/29
మేం వయసుకు వచ్చాం - జూన్ 23
ఓనమాలు
- జూన్ చివరి వారం
ఈగ -
జులై 06
దేవుడు
చేసిన మనుషులు - జులై 13
ఊ కొడతారా ఉలిక్కి పడతారా - జులై రెండో వారం
జులాయి
- జులై చివరి వారం
డమరుకం
- ఆగస్టు
విశ్వరూపం
- జులై చివరి వారం లేదా
ఆగస్టు
డూప్లికేట్
- ఆగస్టు 15
రెబెల్
- ఆగస్టు 9/16
కార్తీ,
ప్రణీత హీరో హీరోయిన్లుగా ఎన్.శంకర్దయాళ్ దర్శకత్వంలో
తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన
చిత్రం ‘శకుని'. ‘సమకాలీన రాజకీయాల్ని ప్రక్షాళనం చేయాలన్న తపన వున్న యువకుడతను.
రాజకీయ వైకుం అతను వేసే
పాచికలు ఆ యువకుడి రాజకీయ
ప్రస్థానాన్ని ఎలాంటి మలుపు తిప్పాయి? అతను
చేసిన శకుని రాజకీయం వ్యవస్థలో
ఎలాంటి మార్పులు తీసుకువచ్చిందో ‘శకుని' చిత్రంలో చూపించబోతున్నారు.
అజిత్
హీరోగా అప్పట్లో వచ్చిన తమిళ చిత్రం ‘బిల్లా'చిత్రం భారీ విజయం సాధించిన
నేపపథ్యంలో.....తాజాగా ‘బిల్లా 2' చిత్రం కూడా రూపొందుతోంది. సాధారణంగా
తొలుత ఒక సినిమా వచ్చిందంటే
దానికి కొనసాగింపు స్టోరీగా సీక్వెల్ రూపొందిస్తుంటారు. కానీ బిల్లా-2 చిత్రం
బిల్లా చిత్రానికి ప్రీక్వెల్. అంటే ముందు జరిగిన
కథ. మనకు ఇప్పటికే ‘బిల్లా'
చిత్రం ద్వారా తర్వాతి కథను చూపించారు. తెలుగులో
బిల్లా 2 చిత్రం ‘డేవిడ్ బిల్లా'గా అనువాదం కాబోతోంది.
తనీష్,
నీతి టేలర్, మదాలస శర్మ హీరో
హీరోయిన్లుగా లక్ష్మణ్ సినీ విజన్ సమర్పణలో...లక్కీ మీడియా పతాకంపై
త్రినాథరావు నక్కినను దర్శకుడిగా పరిచయం చేస్తూ బెక్కెం వేణగోపాల్, లక్ష్మణ్ క్యాదారి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మేం వయసుకు వచ్చాం'.
అపజయం
ఎరగని రాజమౌళి ‘ఈగ' చిత్రం ద్వారా
తన దర్శకత్వంలోని వేరియేషన్ చూపించబోతున్నారు. కొత్త కాన్సెప్టు తో
ఈ చిత్రం రూపొందటం, పిల్లలు పెద్దలు తేడా లేకుండా చూడగలిగే
కథ కావటం సినిమాపై అంచనాలు
పెంచుతున్నాయి. నాని, సమంత, సుదీప్
ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి వారాహి
చిత్రం బ్యానర్పై నిర్మిస్తున్నారు.
రవితేజ,ఇలియానా కాంబినేషన్ లో పూరీ జగన్నాధ్
రూపొందించుతున్న చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ప్రకాష్
రాజ్, బ్రహ్మానందం, అలీ,ఎంఎస్ నారాయణ,
కోవై సరళ, సుబ్బరాజు,ఫిష్
వెంకట్, జ్యోతిరానా వంటి వారు ముఖ్య
పాత్రల్లో నటిస్తున్నారు. 'రవితేజ శైలిలో ఆద్యంతం సరదాగా సాగే చిత్రమిది. పూరి
మార్క్ కథ, కథనం, మాటలు
ఇందులో ఉంటాయి.
నందమూరి
నటసింహం బాలకృష్ణ, మంచు మనోజ్ మల్టీ
స్టారర్గా రూపొందుతున్న చిత్రం
‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా'. శేఖర్ రాజా దర్శకత్వం
వహిస్తున్న ఈచిత్రంలో బాలయ్య ఆత్మ రూపంలో కనిపించనున్నారు.
గాంధర్వ మహల్లోకి హీరో మనోజ్ ప్రవేశించాక
కథ మొదలవుతుందని, అక్కడ బాలకృష్ణ ఆత్మ
కలుస్తుందని, హర్రర్, కామెడీ కలగలిసే ఈ సన్నివేశాల్లో బాలకృష్ణ
ప్లాష్ బ్యాక్ విన్న హీరో ఆయన
ఆశయం తీర్చటమే సినిమా ముఖ్య కథాంశం అని
తెలుస్తోంది. మనోజ్ సరసన దీక్షాసేథ్
నటిస్తోంది.
అల్లు
అర్జున్, ఇలియానా జంటగా హారిక అండ్
హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘జులాయి'. త్రివిక్రమ్ మార్కు సినిమా...పూర్తి వినోధ భరితంగా వైవిధ్యంగా
ఉండనుంది. కమల్ హాసన్ హీరోగా
రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం
‘విశ్వరూపం'. అంతర్జాతీయ టెర్రరిజం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది.
0 comments:
Post a Comment