హైదరాబాద్:
తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,
రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ, హీరో జూనియర్ ఎన్టీఆర్
తరుచూ మాట్లాడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు బొజ్జల గోపాలకృష్ణా
రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు
మంగళవారం అన్నారు. ఈ రోజు వారు
మీడియాతో మాట్లాడారు. నారా - నందమూరి కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కోసమే పని చేస్తాయని
వారు చెప్పారు.
ఈ రెండు కుటుంబాలకు చెందిన
వారందరూ త్వరలోనే ఒకే వేదిక పైకి
రానున్నారని వారు చెప్పారు. చంద్రబాబుతో
హరికృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్‌కు విభేదాలు ఉన్నాయన్న
వార్తలను వారు కొట్టి పారేశారు.
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఓ జోకర్‌లా
మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సర్వేలు, చిలక జోస్యాలు చెబుతూ
కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స
సత్యనారాయణలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కోసం ఢిల్లీలో
పడిగాపులు కాస్తున్నారన్నారు. రాష్ట్రంలో నకిలీ ప్రభుత్వం నడుస్తోందన్నారు.
పాలన సజావుగా లేదని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్
చేశారు. పాలన పూర్తిగా స్తంభించి
పోయిందన్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా పాలన సరిగా
లేదని ఢిల్లీలో ఫిర్యాదు చేశారన్నారు.
ముఖ్యమంత్రి
కిరణ్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని విమర్సించారు. ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు కట్టడానికి, ఆయన సభలకు జనాన్ని
తరలించేందుకు ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తున్నారన్నారు. కాగా ఇటీవల
చంద్రబాబుకు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లతో విభేదాలు ఉన్నాయని
ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment