నైజాంలో
‘శకుని'142 థియేటర్లలో ఈ సినిమాను విడుదల
చేస్తే... మూడో రోజుకి 2 కోట్ల
60 లక్షలు వసూలు చేసిందని నైజాం
పంపిణీదారుడు వాసు తెలిపారు. మొన్న
శుక్రవారం విడుదలైన కార్తీ ‘శకుని'చిత్రం సక్సెస్
మీట్ సోమవారం సాయింత్రం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ -‘‘‘శకుని'తో కార్తీ
పూర్తిస్థాయి తెలుగు హీరో అయిపోయారు. మహేష్‌బాబుకు ‘బిజినెస్‌మేన్' ఎలాగో.. కార్తీకి
‘శకుని' అలాగ. కార్తీ ఒన్మేన్ షో వల్లే
ఈ సినిమా ఇంత హిట్ అయ్యింది''
అన్నారు.
కార్తి
మాట్లాడుతూ ''రాజకీయాలు ఈ కథలో ప్రధానం.
అయితే ఎక్కడా విసుగు రాకుండా వినోదం మేళవించి చెప్పాం. అందుకే ఈ సినిమా ప్రేక్షకులకు
చేరువైంది. చిత్రాన్ని రూపొంది స్తున్నప్పుడు సీరియస్ సబ్జెక్ట్ అనుకున్నారు. కానీ పూర్తి ఎంటర్టైన్మెంట్తో
తీయాలనుకుని సక్సెస్ అయ్యాం. కోట శ్రీనివాసరావు, నాజర్,
రాధిక, ప్రకాష్రాజ్లాంటి హేమాహేమీలతో
కలిసి నటించడం వల్ల కొత్త విషయాలెన్నో
తెలుసుకోగలిగాను''అన్నారు.
''బావ
తరవాత ఈ సినిమాతో తెలుగు
ప్రేక్షకుల్ని పలకరించడం ఆనందంగా ఉంది''అని హీరోయిన్
ప్రణీత చెప్పింది. కోటశ్రీనివాసరావు మాట్లాడుతూ..శివకుమార్ కుమారుడు కార్తి తన రక్తంలోనే నటనను
పుణికిపుచ్చుకున్నాడనీ, ఒన్‌మాన్ షోగా
చిత్రాన్ని రక్తికట్టించాడనీ అన్నారు. ప్రకాష్రాజ్, నాపాత్ర సెకండాఫ్లో రావడంతో చిత్రానికి
ఊపు వచ్చిందన్నారు.
చిత్ర
సమర్పకుడు కె.ఇ.జ్ఞానవేల్
మాట్లాడుతూ.. ‘‘కార్తీతో తమిళంలో ‘చిరుతై' చిత్రం నిర్మించాను. ఆ సినిమా చాలా
పెద్ద హిట్. ఆ సినిమా
వసూళ్లని మూడో రోజే అధిగమించిందీ
సినిమా'' అన్నారు. ఈ కార్యక్రమంలో కె.ఇ.జ్ఞానవేల్రాజా,
కోట శ్రీనివాసరావు, సాహితి, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, వాసు
తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment