హైదరాబాద్/తిరుపతి: తమ పార్టీ అభ్యర్థి
ఖరారులో జాప్యం వల్ల, కలిసికట్టుగా పని
చేయకపోవడం వల్ల తిరుపతిలో తాము
ఓటమి పాలయ్యామని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. నూతన దంపతులు రామ్
చరణ్ తేజ, ఉపాసనలతో కలిసి
చిరంజీవి కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి తిరుపతి వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి
మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో విజేతలకు
ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాలను సమీక్షించి లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఆయన
చెప్పారు. కాంగ్రెసును బలోపేతం చేసి విజయం దిశగా
పయనించేలా కృషి చేయాలని ఆయన
సూచించారు. నర్సాపురం, రామచంద్రాపురంల్లో కాంగ్రెసు విజయం సంతోషాన్ని ఇచ్చిందని
ఆయన అన్నారు.
ఉప ఎన్నికల ఫలితాల్లో ఓటమికి కొన్ని కారణాలు ఉన్నాయని, దీనిపై పార్టీలో చర్చ జరగాల్సి ఉందని
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
గిట్టుబాటు ధర లభించకపోవడం, కరెంట్
కోత, పెట్రోల్ ధర పెంపు వంటివి
తమ ఓటమికి కారణాలని ఆయన గురువారం హైదరాబాదులోని
గాంధీభవన్లో అన్నారు. ప్రజాజ్వామ్యంలో
ఇలాంటివి అప్పుడప్పడు జరుగుతూనే ఉంటాయని బొత్స అన్నారు. పార్టీకి
ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక హెచ్చరికగా భావిస్తామని
అన్నారు. వర్గ విభేధాలను సరిదిద్దుకుని
ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కర్నాటకలో
శ్రీరాములు భారీ మెజారిటితో గెలిచారని
అంతమాత్రాన ఆయన సచ్చీలుడు కాదని,
జగన్మోహన్రెడ్డిని కాంగ్రెస్ కుట్రపన్ని అరెస్టు చేసిందని కొందరు ప్రచారం చేశారని, రాష్ట్రంలో అభివృద్ధి ఉన్నా, పరిస్థితులు అనుకూలించలేదని, ప్రజాస్వామ్యాన్ని పటిష్ట పరుచుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఉప
ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేశామని, అయినా
ఓటమికి గల కారణాలు జిల్లా
స్థాయిలో విశ్లేషణ జరుపుతామని అన్నారు. ధాన్యం మద్దతు ధరపై ముందుగా ప్రకటించి
ఉంటే బాగుండేదన్నారు. రెండు చోట్ల కాంగ్రెస్
పార్టీని గెలిపించిన ప్రజలకు సత్తిబాబు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉప ఎన్నికల్లో తాము శక్తివంచన లేకుండా
ప్రచారం చశామని, ప్రధానంగా అవినీతిపైనే పోరాటం చేశామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలిపారు. అంత తకు ముందు
నుంచే రైతు సమస్యలు, ధరల
పెరుగుదల తదితర వాటి సమస్యలపై
పోరాటం చేశామని ఆయన శుక్రవారం హైదరాబాదులో
మీడియా ప్రతినిధులతో అన్నారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అరెస్టు పట్ల ప్రజల్లో కొంత
సానుభూతి చూపిందని, ఉప ఎన్నికల ఫలితాలపై
ఓటమికి గల కారణాలను పార్టీ
సమావేశంలో చర్చిస్తామని అన్నారు. ఉప ఎన్నికల్లో ఉండడంవల్ల
రాష్ట్రపతి అభ్యర్ధిపై ఇంకా చర్చలు జరపలేదని,
ఇప్పుడే మి మాట్లాడలేనని, ఒకటి
రెండు రోజుల్లో పార్టీతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు తెలిపారు.
0 comments:
Post a Comment