ఈ ఫోటోలో ఉన్న పొడవాటి వాహనాన్ని
చూసి ఇదేదో మోడ్రన్ జనరేషన్
రైలో, లేక ఇంటర్ కనెక్టింగ్
వెహికలో అనుకుంటే మీరు బస్సులో కాలేసినట్లే.
ఎందుకుంటే ఇది అక్షరాల బస్సు
కాబట్టి. చైనాకు చెందిన ఓ ప్రముఖ వాహనాల
తయారీ కంపెనీ ఈ పొడవాటి బస్సును
అభివృద్ధి చేసింది. అంతేకాదండోయ్.. ఇది ప్రపంచంలో కెల్లా
అత్యంత పొడవైన బస్సుగా కూడా రికార్డు సృష్టించింది.
చైనాకు
చెందిన యంగ్మ్యాన్ అనే
ఆటోమొబైల్ కంపెనీ ఈ బస్సును రూపొందించింది.
యంగ్మమ్యాన్ జెఎన్పి6250జి
(Youngman JNP6250G)గా పిలువబడే ఈ బస్సు ఒకేసారి
300 మంది ప్రయాణికులకు చోటివ్వగలదు. యంగ్మమ్యాన్ జెఎన్పి6250జి బస్సు
25 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. సాధారణ
బస్సుతో పోల్చుకుంటే ఇది 13 మీటర్లు ఎక్కువ వెడల్పును కలిగి ఉంటుంది.
అధిక
జనాభా కలిగిన చైనా వంటి దేశాలకు
ఇలాంటి పొడవాటి బస్సులు ఎంతో అవసరం. అయితే,
వీటిని నడపటానికి సరైన రోడ్డు రవాణా
వ్యవస్థ కూడా ఉండాలి. యంగ్మమ్యాన్ జెఎన్పి6250జి
బస్సు గంటకు గరిష్టంగా 82 కిలోమీటర్ల
వేగంతో వెళ్తుంది. ఇది ఐదు డోర్లను
40 వరుసలలో సీట్లను కలిగి ఉంటుంది. మరి
మన దేశపు రోడ్లకు ఇలాంటి
బస్సులు సూట్ అవుతాయంటారా..?
0 comments:
Post a Comment