హైదరాబాద్:
అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో
ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి మునుపటికంటే ఉత్సాహంగా ఉన్నారట! ఉప ఎన్నికలలో పా్టీ
ఘన విజయం నేపథ్యంలో ఆయన
మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారని తెలుస్తోంది. జైలుకు వచ్చిన కొత్తలో జగన్ ముభావంగా, ఒంటరిగా
ఉండేవారు. ఆ తర్వాత క్రమంగా
విఐపి ఖైదీలతో మాటా మంతి, షటిల్
ఆడటాలు చేయడం ప్రారంభించారు. అయితే
ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం ఆయనలో ఉత్సాహం పెరిగిందని
అంటున్నారు.
ఉప ఎన్నికలలో పార్టీ గెలుపు నేపథ్యంలో జైలు సిబ్బందికి, ఇతర
ఖైదీలకు మిఠాయిలు పంచేందుకు జగన్ అధికారులను అనుమతి
కోరారని తెలుస్తోంది. అందుకు అధికారులు తిరస్కరించారట. నిబంధనల మేరకు జైలు బయటి
నుంచి మిఠాయిలు తెప్పించి ఖైదీలకు పంచకూడదని చెప్పి పండ్ల పంపణీకి మాత్రం
అనుమతిచ్చారట. కాగా ఉప ఎన్నికలలో
గెలిచిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజేతలు తొమ్మిది మంది జగన్ను
శనివారం కలిసిన విషయం తెలిసిందే.
అనంతరం
వారు మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత
జగన్ను అన్యాయంగా జైలులో
పెట్టిన కాంగ్రెసు సర్కారు వెంటనే గద్దె దిగాలని భూమన
కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన నిలవాలని,
ప్రజా సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి కృషి చేయాలని జగన్
తమకు సూచించారని చెప్పారు. సుశిక్షితులైన సైనికుల్లా తమ నాయకురాలు విజయమ్మ
సారథ్యంలో ముందుకు సాగుతామన్నారు.
జైలులో
జగన్ను కలిసిన విజేతలలో
పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి,
చెన్నకేశవ రెడ్డి, సుచరిత, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కాపు రామచంద్ర రెడ్డి
ఉన్నారు. వీరితో పాటు మైసూరా రెడ్డి,
ఇటీవల కాంగ్రెసుకు రాజీనామా చేసిన సుజయ కృష్ణ
రంగారావులు ఉన్నారు.
0 comments:
Post a Comment