వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహంలో
భాగంగా ప్రత్యర్థులతో మైండ్ గేమ్ అడుతున్నారా
అంటే అవుననే అంటున్నారు విపక్ష నేతలు. జగన్ నేరుగా ఎదుర్కోవడం
కాకుండా ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీసే విధంగా ముందుకు వెళుతున్నారని అంటున్నారు. శాసనసభ్యుల నుండి మొదలుకొని నిన్నటి
సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ
కాల్ లిస్ట్ డేటా వరకు ఆయన
తీరు పక్కా ప్రణాళికతో వెళుతున్నట్లుగా
కనిపిస్తోందని అంటున్నారు.
ఉప ఎన్నికలకు ముందు జగన్ ఎమ్మెల్యేలను
ఉపయోగించుకొని అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో మైండ్ గేమ్ అడుతున్నట్లుగా
పలువురు భావించారు. ఉప ఎన్నికలలో ఘన
విజయం అనంతరం జగన్ తన ఆస్తులపై
విచారణ జరుపుతున్న సిబిఐ జెడితోనూ మైండ్
గేమ్కు తెరదీశారని అంటున్నారు.
జెడి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం లేదా ఆయనను ట్రాన్సుఫర్
చేసే విధంగా జగన్ ఓ ప్రణాళికతో
వెళుతున్నారని అంటున్నారు.
తెలుగుదేశం,
కాంగ్రెసు పార్టీలతో మైండ్ గేమ్ ఆడటం
రాజకీయ వ్యూహంలో భాగమని, అయితే విలేకరులను, మహిళ
అయిన చంద్రబాలను కేసులోకి ఉద్దేశ్య పూర్వకంగా లాగడం మాత్రం సరికాదని
విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిబిఐ జెడి కాల్
లిస్ట్ డేటా తీసుకున్న వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నేతలు.. ఏవైనా అనుమానాలుంటే ఫిర్యాదులు
చేయాలి కానీ... దానిని రాజకీయం చేయడం మాత్రం సరికాదని
అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికార,
విపక్షాలపై రాజకీయం చేయడం ఓకే కానీ..
సిబిఐ జెడిపై అనుమానాలు ఉంటే మాత్రం ఫిర్యాదు
చేస్తే బాగుండేదని, దానిని రాజకీయం చేయడం మాత్రం సరికాదనే
అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా కాల్ లిస్ట్ మాత్రమే
ఇవ్వడం సరికాదని, అనుమానాలుంటే ఏం మాట్లాడారో వాటిని
బయటపెడితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. విధి నిర్వహణ తదితర
ఎన్నో కారణాలతో ఎవరు ఎవరితోనైనా మాట్లాడవచ్చునని
అంటున్నారు.
జెడి
కాల్ లిస్టును కేవలం రాజకీయ లబ్ధి
కోసమే వైయస్సార్ కాంగ్రెసు బయటపెట్టిందని అంటున్నారు. ఎక్కువ ఫోన్లు మాట్లాడారని లీడ్ ఇండియా కార్యకర్త
చంద్రబాల పేరును వివాదంలోకి లాగడాన్ని కూడా ఖండిస్తున్నారు. ఒకరి
వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే హక్కు
ఎవరికీ లేదంటున్నారు. జెడి తీరుపై అనుమానాలుంటే
కాల్ లిస్టుతో పాటు ఏం మాట్లాడారో
తెలుసుకొని ఫిర్యాదు చేస్తే బావుండేదని, అసెంబ్లీ ఎదుట రాద్దాంతం చేయడం
మాత్రమే రాజకీయమే అంటున్నారు.
కాంగ్రెసు,
టిడిపిలను దెబ్బతీసేందుకు తనకు అనుకూలంగా ఉంటున్న
కొందరు ఎమ్మెల్యేలతో జగన్ మైండ్ గేమ్
ఆడుతున్నట్లుగా ఉప ఎన్నికలకు ముందు
అభిప్రాయాలు వెలువడిన విషయం తెలిసిందే. వాపును
బలంగా చూపేందుకు గుప్పెడు ఎమ్మెల్యేలతో మూడేళ్లుగా జగన్ ఆడుతున్న జగన్నాటకమాడుతున్నారని
అంటున్నారు. మూడు పదుల ఎమ్మెల్యేలతోనే
మూడేళ్లుగా జగన్ మైండ్గేమ్
ఆడుతున్నారని, ఆయనకు మద్దతు ఇస్తున్న
ఎమ్మెల్యేలు మధ్యలో సొంత గూటికి వెళుతున్నారని
అంటున్నారు.
మూడు
పదుల ఎమ్మెల్యేలతోనే మూడేళ్లుగా జగన్ మైండ్గేమ్
ఆడుతున్నారని, ఆయనకు మద్దతు ఇస్తున్న
ఎమ్మెల్యేలు మధ్యలో సొంత గూటికి వెళతారని,
జగన్ కష్టాల్లో ఉన్నారని భావించినప్పుడు.. వారే తిరిగి జగన్
గూటికి చేరుతుంటారని అంటున్నారు. ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతుందని
అనుమానిస్తున్నారు.
ఆయనకు
మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య
పెరగదు. కానీ, రొటేషన్ పద్ధతిలో
వారినే మళ్లీ మళ్లీ తెరపైకి
తీసుకు రావడంతో ఆయనకు ఎంతోమంది ఎమ్మెల్యేలు
మద్దతు ఇస్తున్నారన్న భ్రమ కల్పిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. రెండు, మూడేళ్లుగా
ఆయన ఈ ఎత్తుగడనే విజయవంతంగా
ప్రయోగిస్తున్నారని అంటున్నారు. నిన్నటి వరకు పొలిటికల్ గేమ్
ఆడిన జగన్ ఇప్పుడు జెడి
లక్ష్మీనారాయణపై ఈ అస్త్రం ప్రయోగిస్తున్నారని
అంటున్నారు.
0 comments:
Post a Comment