రాజమండ్రి:
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
ఉండి ఉంటే వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దిన పత్రికను, సాక్షి
టివి ఛానెల్ను మూసి వేయించి
ఉండేవారని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ శనివారం
అన్నారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో ఆయన వార్షిక సమావేశాన్ని
ఏర్పాటు చేశారు.
ఈ వేదికపై పవర్ పాయింట్ ప్రజంటేషన్
ద్వారా ప్రస్తుత పరిస్థితిపై ప్రసంగం చేశారు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని వ్యాపారం
పేరుతో రూ.లక్ష కోట్లు
దోచుకున్న జగన్ ఇప్పుడు పత్రిక,
ఛానల్ను అడ్డం పెట్టుకొని
ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. వైయస్సార్ బతికి ఉంటే ఆ
పత్రిక తనకు అవమానంగా భావించి
మూయించేవాడన్నారు. జగన్కు సంబంధించిన
ఛానల్లో ఉండవల్లి ఊసరవెల్లి
అని, అధిష్టానం భజన చేస్తున్నాడని తప్పుడు
ప్రచారం చేస్తున్నారన్నారు.
ఈ దుష్ప్రచారానికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత
విధేయుడిగా ఉండే వైయస్ ఆత్మ
క్షోభిస్తోందన్నారు. వైయస్ బతికి ఉంటే
అతన్ని కూడా ఆ పత్రిక
ఊసరవెల్లి అనేదేమోనని ఎద్దేవా చేశారు. జగన్ వ్యాపారి అని,
అతనికి రాష్ట్రాన్ని అప్పగిస్తే ప్రజలకు వేలాది రూపాయలు పంచిపెట్టి రూ.లక్షలాది కోట్లు
దోచుకుంటాడని అన్నారు.
వైయస్
ఎన్నిసార్లు రాజకీయంగా విఫలమైనా అతడికి ఉన్నత పదవులు ఇస్తూ
కాంగ్రెసు పార్టీ కాపాడిందన్నారు. ఆయనే బతికి ఉంటే
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ జైలుకు వెళ్లేవాడు కాదన్నారు. జరిగిన దానికి తనే బాధ్యుడిని అని
ఒప్పుకొని జైలులో కూర్చునే వారన్నారు. అటువంటి మనస్తత్వం వైయస్ రాజశేఖర రెడ్డిది
అని కొనియాడారు.
0 comments:
Post a Comment