హైదరాబాద్:
అక్రమాస్తుల కేసులో జైలు పాలైన వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
ఢిల్లీలో మిత్రుల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. తన
అరెస్టుపై రాష్ట్రంలో రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత
వ్యక్తం కాకపోవడం పట్ల జగన్ తీవ్ర
ఆసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. తన సన్నిహితుల ద్వారా
జాతీయ స్థాయిలో రాజకీయ మిత్రులెవరైనా లభిస్తారా అనే అన్వేషణ సాగిస్తున్నట్లు
చెబుతున్నారు.
గత నెల 27వ తేదీన
జగన్ను అరెస్టు చేసిన
తర్వాత పెద్దగా స్పందన రాకపోవడం పట్ల వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని
చెబుతున్నారు. అందుకు తనను రాజకీయ నేతలు
సీరియస్ తీసుకోకపోవడమో, శానససభలో, పార్లమెంటులో తగిన బలం లేకపోవడమో
కారణమని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లో జగన్ చాలా చిన్నవాడనే
భావన జాతీయ స్థాయి నాయకుల్లో
ఉండడం కారణం కావచ్చునని అంటున్నారు.
ఉప ఎన్నికల్లో తన సత్తా ఏమిటో
తెలిసి వస్తుందని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తనపై వచ్చిన ఆరోపణలను లెక్క చేయకుండా తనను
ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారనే
విషయాన్ని ఆయన జాతీయ స్థాయి
నాయకులకు చాటాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 18 శానససభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి
ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
రాజకీయ
కక్షతోనే వైయస్ జగన్ను
అరెస్టు చేశారనే విమర్శలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావించినట్లు చెబుతున్నారు. బిజెపి జాతీయ నాయకులు కాస్తా
గొంతెత్తడానికి ప్రయత్నించారు. అయితే, రాష్ట్రంలోని పరిస్థితుల వల్ల బిజెపి వెనక్కి
తగ్గినట్లు తెలుస్తోంది. మేనకా గాంధీ మాత్రం
వైయస్ విజయమ్మకు ఫోన్ చేసి మద్దతు
ప్రకటించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద, జగన్ ఆశించిన
స్థాయిలో తన అరెస్టుపై ఆగ్రహం
వెల్లువెత్తలేదని అంటున్నారు.
0 comments:
Post a Comment