హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను
లక్ష్యంగా చేసుకుని కాంగ్రెసు నాయకులు మూకుమ్మడి విమర్శలు చేస్తున్నారు. ఓదార్పుయాత్ర చేయవద్దని సోనియాగాంధీ జగన్కు చెప్పలేదని
కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి స్పష్టం
చేశారు. బుధవారం ఉదయం నెల్లూరులో ఆమె
మీడియాతో మాట్లాడారు. చావుకు, పెళ్లికి తేడా లేకుండా జగన్
ఓదార్పు యాత్ర చేశారని ఆమె
వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలకే పరిమితమని, జాతీయ పార్టీలే సమస్యలు
పరిష్కరించగలవని ఆమె తెలిపారు. ప్రజలు
కాంగ్రెస్కు మద్దతివ్వాలని కేంద్ర
మంత్రి పనబాక లక్ష్మి కోరారు.
రాష్ట్రంలో
జరగుతున్న ఉప ఎన్నికలకు జగన్
అరెస్ట్కు సంబంధం లేదని
మంత్రి కొండ్రు మురళి స్పష్టం చేశారు.
బుధవారం ఉదయం ఆయన శ్రీకాకుళం
జిల్లాలో మీడియాతో మాట్లాడారు. భూముల ధరలుపెరగడానికి జగన్
అవినీతే కారణమని ఆరోపించారు. వైస్ మరణాన్ని రాజకీయ
ప్రయోజనాలకువాడుకుంటున్నారని
కొండ్రు మురళి వ్యాఖ్యానించారు. సామాన్యులు
ఇళ్లు కట్టుకోలేని స్థితికి చేరుకోవడానికి వైయస్ జగన్ వల్ల
ధరలు విపరీతంగా పెరగడమే కారణమని ఆయన అన్నారు.
2004 తర్వాత
భూముల ధరలు విపరీతంగా పెరగడంలో
జగన్ కీలక పాత్ర పోషించారని,
తమ వద్ద అందుకు సంబంధించిన
ఆధారాలున్నాయని ఆయన అన్నారు. వైయస్
రాజశేఖర రెడ్డి మరణం వెనక మిస్టరీ
ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆరోపించడం
వెనక రాజకీయ ప్రయోజనం ఉందని ఆయన అన్నారు.
జగన్ అవినీతికి, ఉప ఎన్నికల ఫలితాలకు
సంబంధం లేదని, రెండు వేర్వేరు అంశాలని
ఆయన అన్నారు.
వైయస్
జగన్కు చెందిన సాక్షి
పత్రిక కాంగ్రెసుకు ఉపయోగపడుతుందని అనుకున్నామని, అయితే అదే భస్మార
హస్తంగా మారిందని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన బుధవారం ఎన్నికల
ప్రచారం నిర్వహించారు. కేంద్ర మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా చట్టానికి అతీతుడు
కాడని ఆనయ అన్నారు. జగన్
ఉద్వేగపూరిత బ్లాక్ మెయిలింగ్కు మోసపోవద్దని ఆయన
ప్రజలకు సూచించారు.
0 comments:
Post a Comment