హైదరాబాద్:
తనకు మధ్యంతర బెయిల్ వద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి కోర్టులో మెమో దాఖలు చేశారని
రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ బుధవారం
అన్నారు. ఆయన సిఎల్పీ కార్యాలయంలో
విలేకరులతో మాట్లాడారు. తన తల్లి వైయస్సార్
కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల
శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, తన
సోదరు షర్మిల ప్రచారానికి వస్తున్న ఆదరణ చూసి జైలులోనే
ఉండటం నయమని జగన్ భావిస్తున్నారని
అన్నారు.
అందుకే
తనకు బెయిల్ వద్దని జగన్ కోర్టులో మెమో
దాఖలు చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
మృతిపై అనుమానాలు ఉంటే ఇంతకాలం నివృత్తి
చేసుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదని ఆయన వైయస్ విజయమ్మను
ప్రశ్నించారు. మూడేళ్ల అనుమానాలు కలిగాయా అన్నారు. వైయస్ మృతిపై అనుమానాలు
ఉంటే నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని
చెప్పారు. వైయస్ మృతిని రాజకీయ
లబ్ధి కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరమని
అన్నారు.
వైయస్
మృతిపై అనుమానాలు ఉంటే లోకసభలో వైయస్
జగన్ ఎందుకు లేవనెత్తలేదని ప్రశ్నించారు. విజయమ్మ ప్రచారంతో గెలుస్తామేమోననే ఆశతో జైలు నుండి
బయటకు రావడానికి జగన్ ఇష్ట పడటం
లేదని ఎద్దేవా చేశారు. కాగా విజయవాడ పార్లమెంటు
సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా జగన్ తనకు
మధ్యంతర బెయిలు వద్దని కోర్టులో పిటిషన్ పెట్టారని చెప్పిన విషయం తెలిసిందే.
రాజకీయ
జీవితం ప్రసాదించిన పార్టీకి ద్రోహం చేసి ఉప ఎన్నికలకు
కారణమైన వారికి తమ ఓటు ద్వారా
గట్టిగా బుద్ది చెప్పాలని పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి
శ్రీనివాస్ అన్నారు. ఆయన గుంటూరు జిల్లా
ప్రత్తిపాడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో
మంత్రి కన్నా లక్ష్మీ నారాయణతో
పాటు ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో
అమలవుతున్న పథకాలన్నీ కాంగ్రెసు పార్టీకి చెందినవే తప్ప ఎవరి వ్యక్తిగతం
కావని డిఎస్ అన్నారు.
పథకాల
రూపకల్పనకు 2004లో ఎంతో శ్రమించాల్సి
వచ్చిందన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదించాకే ప్రభుత్వం
అమలు చేసిందని చెప్పారు. కాంగ్రెసు అభ్యర్థి టిజెఆర్ సుధాకర్ బాబును గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
కాంగ్రెసు పార్టీ ప్రజల సంక్షేమ కార్యక్రమాలు
చేపట్టిందన్నారు.
బెయిల్
వద్దని జగనే కోర్టుకు లేఖ
రాశారని లగడపాటి రైల్వే కోడూరులో అన్నారు. అతనే బెయిల్ వద్దని
చెప్పి ఇప్పుడు కాంగ్రెసు పైన విమర్శలు చేయడం
విడ్డూరంగా ఉందన్నారు. జగన్ దృష్టిలో బిసి
అంటే బ్రీఫ్ కేసు, ఎస్సీ అంటే
సూటుకేసు అన్నారు. వైయస్ కుటుంబానికి కాంగ్రెసు
పార్టీ ఏం అన్యాయం చేసిందని
ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డిని
రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేయడం, రెండుసార్లు పిసిసి చీఫ్గా చేయడం
తప్పా అని ప్రశ్నించారు.
జగన్ను ఎంపిని చేయడం
తప్పా అన్నారు. వారే కాంగ్రెసు పార్టీని
మోసం చేసి బయటకు వెళ్లి
పోయారన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్ష
కోట్లు సంపాదించుకున్నారని మండిపడ్డారు. రాజా, కనిమొళి, సురేష్
కల్మాడీ తదితరులు అవినీతి కేసులో జైలులో ఉన్నారన్నారు. జగన్ ఒక్కడే జైలుకు
వెళ్లలేదన్నారు. వైయస్ విజయమ్మ తన
సవాల్కు ఇంత వరకు
స్పందించలేదన్నారు. అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెసు
ఘన విజయం సాధించడం ఖాయమన్నారు.
0 comments:
Post a Comment