తన బావ మరిది బాలకృష్ణ
ప్రత్యక్ష రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
ప్రయోగాలు చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచి బాలకృష్ణ ఎక్కడి
నుంచి పోటీ చేయాలనే విషయంపై
కసరత్తు సాగుతోంది. కృష్ణా జిల్లా నుంచే పోటీ చేయాలని
కొంత మంది నాయకులు బాలకృష్ణకు
సూచిస్తుండగా, హిందూపురం శాసనసభా స్థానం నుంచి గానీ పెనమలూరు
నుంచి గానీ పోటీ చేయాలని
బాలకృష్ణ ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు.
హిందూపురం
నుంచి తన తండ్రి ఎన్టీ
రామారావు ప్రాతినిధ్యం వహించడం వల్ల బాలయ్య ఆ
సీటుపై ఆసక్తి చూపుతున్నట్లు కూడా చెబుతున్నారు. పెనమలూరు
మరో ఆప్షన్‌గా ఆయనకు ఉన్నట్లు
చెబుతున్నారు. అయితే, చంద్రబాబు ఆలోచన మరో విధగంగా
ఉన్నట్లు తెలుస్తోంది. శానససభకే పోటీ చేయాలని బాలకృష్ణ
పోటీ చేయాలని పట్టుబడితే గుడివాడ సీటును ఆయన సూచిస్తున్నట్లు చెబుతున్నారు.
గుడివాడలో కొడాలి నానికి బుద్ధి చెప్పాలంటే బాలకృష్ణ మాత్రమే సరిపోతారని ఆయన అనుకుంటున్నారట.
కాగా,
తెలుగుదేశం పార్టీలో మరో వాదన కూడా
ముందుకు వస్తోంది. బాలకృష్ణను పార్లమెంటుకు పోటీ చేయించాలనేది చంద్రబాబు
ప్రథమ ప్రాధాన్యం అంటున్నారు. బాలకృష్ణ శాసనసభకు వస్తే పార్టీలో రెండో
అధికార కేంద్రం ఏర్పడుతుందని, దాని వల్ల సమస్యలు
ఉత్పన్నమవుతాయని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో బాలకృష్ణను లోకసభకు
పోటీ చేయించాలని ఆయన అనుకుంటున్నారట.
అయితే,
బాలకృష్ణ మాత్రం శాసనసభకే పోటీ చేయడానికి ఆసక్తి
చూపుతున్నట్లు తెలుస్తోంది. తాను శాసనసభకే పోటీ
చేస్తానని ఆయన గతంలో ఓసారి
స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి
అని బాలకృష్ణ స్పష్టంగానే చెప్పారు. ఓ రకంగా తాను
ముఖ్యమంత్రి పదవికి పోటీకి రాబోనని బాలకృష్ణ సంకేతాలు ఇచ్చినట్లు ఆ ప్రకటనను భావించాల్సి
ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద, బాలకృష్ణ ప్రత్యక్ష
రాజకీయాల ప్రవేశంపై పార్టీలో విస్తృతంగానే చర్చ సాగుతోంది.
0 comments:
Post a Comment