విక్రమ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించబోతున్న తాజా చిత్రం 'ఐ'. ఆస్కార్ ఫిలిమ్స్ ప్రై.లి. సంస్థ పై భారీగా వి.రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందబోతోంది. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం చెన్నైలో జరిగింది. విక్రమ్, అమీ జాక్సన్‌ల మధ్య వచ్చే సన్నివేశాల్ని చిత్రీకరించినట్లు సమాచారం. కథకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఇక షూటింగ్ ప్రదేశాల కోసం దర్శకుడు కొద్దిరోజుల
కిందట చైనాలో పర్యటించారు. మరో పది రోజుల్లో
చిత్రబృందం చైనాకు వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్కడే నెలరోజుల పాటు షూటింగ్ చేస్తారు.
ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్
సంగీతం సమకూరుస్తున్నారు. ఇక బాలీవుడ్ సినిమా
'త్రీ ఇడియట్స్' ని రీమేక్ చేసిన
తరవాత శంకర్... మళ్లీ తన శైలిలోకి
వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. విక్రమ్‌ని దృష్టిలో పెట్టుకొని
శంకర్ ఈ కథను సిద్ధం
చేసుకొన్నారని సమాచారం.
కొన్ని
రోజులుగా ఈ కథ విషయంపై
శంకర్, విక్రమ్‌ల మధ్య చర్చలు
నడుస్తున్నాయి. విక్రమ్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం
'అపరిచితుడు'. శంకర్ ఆలోచనలకు, సృజనాత్మకతకూ ఈ సినిమా అద్దం
పట్టింది. మళ్లీ వీరిద్దరి కలయికలో
ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది.. ఆ అవకాశం ఉందంటున్నారు
శంకర్ అభిమానులు. ఇది పొలిటికల్ డ్రామా
అని చెప్తున్నారు. ఎన్నికల విధానంపై ఈ చిత్రం సాగుతుందని
సమాచారం. దర్సకుడు శంకర్ కోరిక మీదట
ఈ చిత్రానికి సమంత 180 రోజులు కేటాయించారు. అలాగే పీసీ శ్రీరామ్
ఛాయాగ్రాహకునిగా వ్యవహరిస్తున్నారు.
విక్రమ్,
శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అపరిచితుడు'
విడుదలై ఇప్పటికి దాదాపు ఏడేళ్లు అవుతోంది. చాలా విరామం తర్వాత
ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా
కాబట్టి ‘ఐ పై ఇప్పటికే
భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే
ఏడాది విడుదల చేస్తారు. త్రీ ఇడియట్స్ రీమేక్
చేసిన శంకర్ ఆ చిత్రం
వర్కవుట్ కాకపోవటంతో ఈ సారి మళ్లీ
తన రూట్ లోకే వెళ్లి
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీగా రూపొందే ఈ చిత్రం ఇప్పటివరకూ
ఇండియన్ తెరపై ఎవరూ టచ్
చేయని సబ్జెక్టుతో నిండి ఉంటుందని చెప్తున్నారు.
యాక్షన్,ఎంటర్టైనర్ తో మాస్ మసాలాగా
ఉంటూనే సామాజిక సందేశం తో తయారు చేసిన
ఈ స్క్రిప్టు దక్షిణాది భాషలకే కాక హిందీ వారిని
సైతం అలరించేలా ప్లాన్ చేస్తున్నారు.
0 comments:
Post a Comment