రొట్టె మంచిదా? అన్నం మంచిదా? అనే అంశం ప్రతి ఇంటిలోను ఎంతో కాలంగా చర్చించబడుతూనే ఉంటుంది. దేని మంచి దానిదే? దేని ఆరోగ్యం దానిదే అంటూ ఎవరికిష్టమైన రీతిలో వారు సమర్ధించుకుంటారు. కొంతమంది అన్నం తింటే లావెక్కి పోతారంటారు. కొంతమంది చపాతి లేదా రొట్టెలు తింటే జీర్ణం చేసుకోవడం కష్టం అంటారు. మరి వీరి మాటలలో వాస్తవం ఎంతా? అన్నం తింటే లావెక్కటం, రొట్టెలు జీర్ణం కాకపోవడం వంటి అంశాలు వివరంగా పరిశీలించండి. ఆరోగ్య కరమైన ఈ రెండు ఆహారాలలో ఏది గెలుస్తుందో పరిశీలిద్దాం.
కార్బోహైడ్రేట్లు
- ముందుగా వీటిలోని కార్బోహైడ్రేట్లు గమనించండి. అన్నంలో కార్బోహైడ్రేట్లు తక్కువ. మరి రొట్టెలో అధికంగా
ఉంటాయి. ఈ అధిక కార్బోహైడ్రేట్లను
జీర్ణం చేయాలంటే అధిక కేలరీలు ఖర్చు
చేయాలి. అదే అన్నం జీర్ణం
కావాలంటే, రొట్టెల కంటే కూడా తక్కువ
ఎనర్జీ సరిపోతుంది. ఎవరికైనా జీర్ణ వ్యవస్ధ బలహీనంగా
ఉంటే, వారికి రొట్టెలు అరగటం లేదా జీర్నం
అవటం కష్టం. వీరు అన్నం తినటమే
మంచిది.
సోమరితనం
- అన్నం లంచ్ లేదా డిన్నర్
లో తింటే చాలామంది బద్ధకంగా
ఉంటుందంటారు. రైస్ మీకు అతి
త్వరగా జీర్ణం అయి రక్తంలోని షుగర్
అధికం చేస్తుంది. ఈ కారణంగానే కొంతమంది
అన్నం తినగానే సోమరిగా ఉంటారు. అదే మీరు రొట్టెలు
లేదా చపాతీ తింటే ఈ
బద్ధకం అనేది మీకు రాదు.
ఈ కారణంగానే చాలామంది రొట్టెలు లేదా చపాతీలు తినేందుకు
ఇష్టం చూపుతారు.
కొవ్వు
పట్టడం - అన్నంలో కొవ్వులు అధికం. కనుక మీరు ఆహారాలు
బాగా తినేవారైతే, రైస్ లేదా అన్నం
తినకండి. రొట్టెలలో కొవ్వులు అధికంగా ఉండవు. అందుకనే ధైరాయిడ్ లేదా అధికబరువు ఉండే
వారు వారి భోజనంలో అన్నాన్ని
తినరు. అన్నం వండే విధానంలో
కూడా అది ఉంటుంది. అన్నాన్ని
కనుక మీరు ప్రెషర్ కుక్కర్
లో వండితే, అది అనారోగ్యమే. అధిక
నీటిని అది పీల్చుకుంటుంది. కనుక
అన్నాన్ని ఆవిరి బయటకు బాగా
పోయేలా విడిగా వండండి.
పీచు
- ఇక పీచు విషయాలనికి వస్తే,
అది అన్నంలో ఉంటుందా? లేక రోట్టెలలో అధికంగా
ఉంటుందా? అనేది పరిశీలిద్దాం. పీచు
రొట్టెలలోనే అధికంగా ఉంటుంది. మీకు మలబద్ధకం ఏర్పడదు.
అదే మీరు రైస్ తిన్నట్లయితే
రొట్టెలలో అందినంత పీచు మీకు అందదు.
వాస్తవానికి
అన్నం లేదా రొట్టెలు ఏదైనప్పటికి
గింజలనుండి వచ్చినవే. దేని లాభాలు దానికి,
దేని నష్టాలు దానికి ఉన్నాయి. కనుక మీరు ఆహారంగా
దేనిని తీసుకోవాలంటే దానిని అంటే, రొట్టెలు లేదా
అన్నం మీ ఆహారంలో చేర్చండి.
అన్నం తిన్నప్పటికి తక్కువ మొత్తంలో అన్నాన్ని తింటూ, అధిక పరిమాణంలో కూరలు,
లేదా పప్పు వంటివి అధికంగా
తినండి. అధిక మొత్తంలో తినే
కూరలు మీ ఆరోగ్యానికి ఎంతో
సహకరిస్తాయి.
0 comments:
Post a Comment